Arunacha Pradesh: అరుణాచల్ ప్రదేశ్ లో కూలిన సైనిక హెలికాప్టర్
భారతదేశం ఓ లెప్టినెంట్ కల్నల్ ను పోగొట్టుకొనింది. రోజువారీ గస్తీలో తిరుగుతుండగా అరుణాచల్ ప్రదేశ్ లో ఈ ఘటన చోటుచేసుకొనింది
Helicopter Crashed: భారతదేశం ఓ లెప్టినెంట్ కల్నల్ ను పోగొట్టుకొనింది. రోజువారీ గస్తీలో తిరుగుతుండగా అరుణాచల్ ప్రదేశ్ లో ఈ ఘటన చోటుచేసుకొనింది.
వివరాలమేరకు, భారత సైన్యంకు చెందిన చీతా హెలికాప్టర్ ద్వారా అరుణాచల్ ప్రదేశ్ లోని తవంగ్ లో ఇద్దరు పైలట్ సైనికులు పహారా చేస్తుండా ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం నేటి ఉదయం 10 గంటల సమయంలో చోటుచేసుకొనింది. వెంటనే ఇద్దరు సైనిక క్షతగాత్రులను సమీపంలోని సైనిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం లెప్టినెంట్ కల్నల్ సౌరభ్ యాదవ్ మరణించిన్నట్లు సైనిక అధికారులు పేర్కొన్నారు. గాయపడిన మరో పైలట్ కు చికిత్సను అందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.
2021లోకూడా నీలగిరిలో ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటన ఏకంగా డిఫెన్స్ శాఖాధిపతి జనరల్ బిపిన్ రావత్ దంపతులు దుర్మరణం పాలైనారు. తాజాగా మరో సైనిక హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్ లో కూలిపోవడం సైనిక వర్గాల్లో ఆందోళన కల్గిస్తుంది.
ఇది కూడా చదవండి:Uttarakhand: పెళ్లింట విషాదం.. లోయలో పడి 25 మంది మృతి