Last Updated:

PM Modi: మోదీకి 25 ఎకరాల భూమి రాసిస్తా అంటున్న 100ఏళ్ల వృద్ధురాలు.. ఎందుకంటే..?

PM Modi: మధ్యప్రదేశ్‌ రాజ్‌గఢ్ జిల్లా హరిపుర గ్రామంలో నివాసం ఉంటున్న ఈ శతాబ్ధి వృద్ధిరాలు. ఈ నూరేళ్ల వృద్ధురాలికి మోదీ అంటే ఎంత ఇష్టమంటే ఆయనకు తన 25 ఎకరాల భూమిని రాసి ఇచ్చేస్తా అంటున్నంది ఈ భామ్మ. మరి ఈమె ఎవరు ఈమెకు మోదీ అంటే ఎందుకు అంత ఇష్టమో తెలుసుకుందాం.

PM Modi: మోదీకి 25 ఎకరాల భూమి రాసిస్తా అంటున్న 100ఏళ్ల వృద్ధురాలు.. ఎందుకంటే..?

PM Modi: ప్రధాని మోదీ చేస్తున్న సేవలకు ఆయన నిబద్ధతకు దేశంలోనే కాక యావత్ ప్రపంచంలోనూ ఆయనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కాగా అలాంటి వారిలో ఒకరే మధ్యప్రదేశ్‌ రాజ్‌గఢ్ జిల్లా హరిపుర గ్రామంలో నివాసం ఉంటున్న ఈ శతాబ్ధి వృద్ధిరాలు. ఈ నూరేళ్ల వృద్ధురాలికి మోదీ అంటే ఎంత ఇష్టమంటే ఆయనకు తన 25 ఎకరాల భూమిని రాసి ఇచ్చేస్తా అంటున్నంది ఈ భామ్మ.
మరి ఈమె ఎవరు ఈమెకు మోదీ అంటే ఎందుకు అంత ఇష్టమో తెలుసుకుందాం.

మంగీబాయి తన్వర్ అనే 100ఏళ్ల వృద్ధురాలికి ప్రధాని నరేంద్ర మోదీ అంటే చాలా ఇష్టం. ఎందుకు అని ఆమెను ఎవరైనా అడిగితే మోదీ దేశానికి ఎంతో సేవ చేస్తున్నారు. తనలాంటి వృద్ధులకు ఎన్నో అవసరాలు తీరుస్తున్నారు అంతే కాకుండా మోదీ నాకు ఇల్లు ఇచ్చారు. వైద్యం అందిస్తున్నారు.. వితంతపు పింఛన్ ఇస్తున్నారు.. వేళకు ఇంత తినేలా చేస్తున్నారు అంటూ మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. మోదీ ఇన్ని పథకాలను తనకు ఇవ్వటం వల్లే తాను డబ్బులు జమ చేసుకుని తీర్థయాత్రలు వెళ్లగలిగానని చెబుతున్నారు. అందుకే ఆయనంటే చాలా ఇష్టమని చెబుతోంది. అంతేకాదు తనకు 25 ఎకరాల భూమి ఉందని ఆ భూమిని మోదీకి రాసి ఇచ్చేస్తానని అంటుంది.

ఎవరూ లేరని కాదు ఆయన సేవను మెచ్చే(PM Modi)

పోనీ ఆమె ఇంతా చేస్తుంది అంతే ఆమెకు ఎవరూ లేరని అనుకుంటున్నారేమో.. మంగీబాయికి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 14మంది సంతానం ఉన్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీని తన 15వ కుమారుడిగా భావిస్తున్నానని దేశానికి ఎంతో సేవ చేస్తున్న ఆయనకు ఏమిచ్చినా ఎంతిచ్చినా తక్కువేనంటున్నారు మంగీభాయి. ఈ వందేళ్ల వృద్ధురాలు మోదీకి 25 ఎకరాలు రాసిస్తానని చెప్పిన వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేడు ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఇదే సమయంలో మంగీబాయి వీడియో వైరల్ కావటం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. తనకు అవకాశం ఉంటే మోదీని స్వయంగా కలుస్తానని మంగీబాయి చెప్పటం మరో విశేషం.