Published On:

Ashadha Amavasya 2025: ఆషాడ అమావాస్య లక్ష్మీదేవతకు పితృదేవతలకు ప్రసిద్ది.. ఇలా పూజిస్తే కనకవర్షమే!

Ashadha Amavasya 2025: ఆషాడ అమావాస్య లక్ష్మీదేవతకు పితృదేవతలకు ప్రసిద్ది.. ఇలా పూజిస్తే కనకవర్షమే!

Ashadha amavasya 2025: ఆషాడ అమావాస్య హిందూ ధర్మంలో అతిప్రాముఖ్యత కలిగి ఉంది. ఇది పేరులో ఉన్నట్లుగానే ఆషాడమాసంలో వచ్చే అమావాస్య. ఈ రోజున ప్రజలు ప్రత్యేక ఆచారాలను, పూజలను చేస్తారు. కొందరు తమ పూర్వీకులకు ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు. అసలు అవావాస్య ఎప్పుడు సమయం మరియు ప్రాముఖ్యతను ఇప్పుడు తెలుసుకుందాం.

 

హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యను ఆషాడఅమావాస్య అంటారు. ఈ రోజున, ప్రజలు తమ పూర్వీకులనుంచి సంక్రమించిన ఆచారాలు మరియు ప్రార్థనల వారి పెద్దలను గౌరవించుకుంటారు. కొంతమంది నదులలో స్నానం చేస్తారు, మరికొందరు ఇంట్లో ఆచారాలను నిర్వహిస్తారు.

 

ఈ అమావాస్యను పితృ అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ అమావాస్యనాడు ప్రజలు పూజలు చేసి దానధర్మాలు చేస్తారు. ఇది వారివారి పూర్వీకులతో బంధాన్ని బలోపేతం చేయడానికి, వారి ఆశీర్వాదాలను పొందడానికి సహాయపడుతుందని నమ్ముతారు.

 

పంచాంగం ప్రకారం ఆషాఢమాస అమావాస్య జూన్ 25న వస్తుంది. తిధి జూన్ 24న సాయంత్రం 06:59 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అనగా జూన్ 25 సాయంత్రం 4గంటలకు ముగుస్తుంది.

 

ఆషాఢ అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున నిర్వహించే వేడుకలలో ఒకటి దీప పూజ. ఇంటిని శుభ్రం చేసి అలంకరిస్తారు. ఒక టేబుల్‌ను ఏర్పాటు చేసి, ప్రకాశవంతమైన రంగులతో దీపాలను అలంకరిస్తారు. ఇది దైవిక వాతావరణాన్ని సృష్టిస్తుంది.

 

ఈ అమావాస్యనాడు మరికొంత మంది ఇష్టదేవతను, కుల దేవతను, ఇంటిదేవతను పూజిస్తారు. పంచభూతాలైన గాలి, నీరు, ఆకాశం, భూమితో పాటు లక్ష్మీ , పార్వతి, సరస్వతి దేవతలను పూజిస్తారు. ఎందుకంటే వారిని పూజించడం వలన ప్రతికూలత తొలిగిపోయి దేవతానుగ్రహం లభిస్తుంది.

 

ఇవి కూడా చదవండి: