Published On:

Fitness Goals in Vacation: సెలవుల్లో ఫిట్ నెస్ కు 5 ఉపాయాలు.. ఇవి పాటిస్తే అద్భుతాలే..!

Fitness Goals in Vacation: సెలవుల్లో ఫిట్ నెస్ కు 5 ఉపాయాలు.. ఇవి పాటిస్తే అద్భుతాలే..!

Fitness goals in Vacation: జీవితం అంటే దానికో అర్థం ఉండాలి. అప్పుడే విలువ పెరుగుతుంది. ఎలాపడితే అలా బ్రతికితే పెద్దగా విలువ ఉండదు. అందుకే ఇంగ్లీష్ లో దీన్ని లైఫ్ స్టైల్ అంటారు. మన జీవనంలో ప్రతీదానికి ఒక నియమం నిష్ట అనేది ఉండాలి. ఎంత తినాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి లాంటి నియమాలే ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. అందులో ఫిట్ నెస్ అతి ముఖ్యమైనది.

 

నగరాల్లో బిజీ లైఫ్ గడిపే వ్యాపారులు, ఉద్యోగులు తమ జీవితంలో కఠినమైన నియమాలు పాటిస్తూ కెరీర్ లో ముందుకు అడుగేస్తుంటారు. అలాంటి వాళ్లు కాస్త సేదతీరడానికో లేక అనుకోకుండా సెలవులు ఫంక్షణ్ లు వస్తాయి. అప్పుడే డేలీ ఫాలో అవుతున్న షెడ్యూల్ మిస్ అవుతుంది. అప్పుడు డైట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎక్కువగా తినడమో లేక వ్యాయామం చేయకపోవడమో జరుగుతుంది.

 

అలాంటప్పుడే ఎలాంటి నిర్ణయాలను తీసుకోవాలో ఫిట్ నెస్ కోచ్ రాజ్ గణపత్ చెబుతున్నారు. ప్రయాణాలలో ఉన్నప్పుడైనా, ఫంక్షన్ అకు అటెండ్ అయినప్పుడైనా చిన్నపాటి చిట్కాల్ పాటించాలని అంటున్నారు.

 

ముందుగా మీ మనసును అర్థం చేసుకోండి..

మీరు మీ మనుసును ముందుగా అర్ధం చేసుకోవాలని అంటున్నాడు రాజ్. సెలవులను మీరు ఎలా చూస్తారనే దానిపై ప్రతీది ఆదారపడి ఉంటుందంటున్నాడు. ప్రయాణాన్ని రోజువారీ జీవితంతో ముడిపడి ఉన్న ప్రతిదానికి ప్రభావితం చేయకూడదని చెబుతున్నాడు. ఇది కేవలం మరో ప్రదేశం మాత్రమేనని ప్రతీరోజు సాగించే పనులను ఎదావిధిగా చేయాలని అందుకు మనసుకు కఠినమైన నిబందనలను అలవాటుచేయాలంటున్నాడు.

 

ప్రతిరోజూ వ్యాయామం చేయండి..

మీ దైనందిన దినచర్యలో వ్యాయామం చేయాలి. ఏదైనా చేయండి. ప్రతిరోజూ 30 నుండి 60 నిమిషాలు చురుకుగా ఉండాలి అందుకు ఏ వ్యాయామమైనా చేయండి. కానీ తప్పనిసరి చేయాలి.

 

వీలైనంత ఎక్కువ నడవండి..

ప్రతిరోజూ నడవడం యొక్క అవసరాన్ని రాజ్ నొక్కిచెప్పారు. సాధారణం కంటే ఎక్కువగా, సెలవులలో ఉన్నప్పుడు నడవాలన్నారు. పనుల నుంచి బయటపడ్డప్పుడు సమయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నడకకు ఎక్కువ సమయం కెటాయించాలి. కాబట్టి వీలైనంత ఎక్కువసేపు నడవండి.

 

మీ పోషకాహారాన్ని సరళీకరించండి..

బఫేలు ఆహారాన్ని అధికంగా తీసుకోవడానికి కారణమవుతాయి. సాధారణ రోజులలో భోజనం చేసినట్లు ఆహారాన్ని కావలసినంతగానే తీసుకోవాలి. అధికంగా తీసుకోకూడదు అక్కడ ఎన్ని వెరైటీలు ఉన్నాసరే. అందులోనూ ప్రొటీన్, కూరగాయలను తినండి.

 

సాధారణం కంటే ఎక్కువ నిద్రపోండి..

రొటీన్ పనులనుంచి టైం దొరకగానే ఆ సమయాన్ని విశ్రాంతికి ఉపయోగించాలి. మంచి ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యమైనది. నిద్రవలన మనసు తేలికగా అనిపిస్తుంది. పైగా సెలవునుంచి తిరిగి ప్రయాణం అయినప్పుడు పనులలో చైతన్యం కనపడుతుంది.

 

 

ఇవి కూడా చదవండి: