Former Minister Taneti Vanitha: కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపు రాజకీయాలు: మాజీ హోంమంత్రి తానేటి వనిత

Former Minister Taneti Vanitha On TDP Govt: కూటమి ప్రభుత్వంలో ఏపీలో భయంకరమైన రాజకీయాలు చూడాల్సిన పరిస్థితులు వచ్చాయని మాజీ హోంమంత్రి తానేటి వనిత అన్నారు. కేవలం కక్ష సాధింపు రాజకీయాలే కనబడుతున్నాయని ఆమె విమర్శించారు. ఏపీలో రాజ్యాంగబద్ధంగా పాలన సాగడం లేదని ధ్వజమెత్తారు. టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి వయస్సుకు తగ్గ మాటలు మాట్లాడటం లేదని విమర్శించారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేసిన బుచ్చయ్య చౌదరిపై కేసులు ఉండవన్నారు. వాళ్లు మాట్లాడిన మాటలకు ఎటువంటి సెక్షన్లు వర్తించవా అని ప్రశ్నించారు.
వైసీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు మాట్లాడితే మాత్రం వెంటనే ఎక్కడ లేని సెక్షన్లు పుట్టుకొచ్చే పరిస్థితి ఏపీలో ఉందని దుయ్యబట్టారు. ఓ అభిమాని ప్లకార్డు ప్రదర్శించిన దాని గురించి మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు ప్రెస్‌మీట్‌లు పెట్టి టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏపీలో వాస్తవాలను వాస్తవాలుగా చూపించడం, తప్పు జరిగిన చోట ఖండించడం జరగడం లేదన్నారు. పల్నాడు ఘటనలో ఎస్పీ మీడియా సమావేశం ముందు ఒకలా మాట్లాడారని, ఈ రోజు ఎస్పీని మ్యాను ప్లేట్ చేశారని ఫైర్ అయ్యారు. మార్చేసి వాళ్లకు ఇష్టం వచ్చినట్లు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. జగనన్న ఎక్కడికి వెళ్లినా ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని తెలిపారు. అది చూసి నేతల తట్టుకోలేకపోతున్నారన్నారు. కూటమి నేతలు చెప్పిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. నమ్మి ఓట్లేసి మోసపోయామని ప్రజలకు కుమిలిపోతున్నారని పేర్కొన్నారు.
ప్రతి కుటుంబంలో కూడా జగనన్నను గుర్తుచేసుకోని వారు ఎవరూ లేరన్నారు. పవన్ కల్యాణ్ రాజకీయం కోసం తమపై బురద చల్లడం కోసం మహిళలు మిస్ అయ్యారని తెలిపారు. వలంటీర్లకు 5వేలు ఏం సరిపోతాయని, మీ పొట్టను కొట్టను అన్నాడని, ఇప్పుడు పవన్ ఎవరీపొట్ట కొట్టారన్నారు. పవన్ నియోజకవర్గంలో దళితులు వెలివేతకు గురైతే కనీసం స్పందించలేదన్నారు. ప్రశ్నించే గొంతు అన్నారు. కదా గొంతుక ఇప్పుడు ఏమైంది..? అని ప్రశ్నించారు.