Last Updated:

Haryana: మొక్కలకు పెన్షన్.. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పథకం

Haryana: రోజురోజుకు పర్యావణంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. పల్లెలు పోయి పట్నాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అటవీ సంపద నానాటికీ తరిగిపోతుంది. చెట్లను ఇష్టవచ్చినట్టు నరకడంతో అడవులు బోసిపోతున్నాయి. పచ్చదనం కరువై కాలుష్యం పెరుగుతోంది.

Haryana: మొక్కలకు పెన్షన్.. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పథకం

Haryana: రోజురోజుకు పర్యావణంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. పల్లెలు పోయి పట్నాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అటవీ సంపద నానాటికీ తరిగిపోతుంది. చెట్లను ఇష్టవచ్చినట్టు నరకడంతో అడవులు బోసిపోతున్నాయి. పచ్చదనం కరువై కాలుష్యం పెరుగుతోంది. ఇందుకుగానూ హర్యానా ప్రభుత్వం ప్రకృతిని కాపాడి భవిష్యత్ తరాలకు ప్రాణవాయువును అందించేందుకు ఓ వినూత్నమైన ముందడుగు వేసింది. వృక్షాలను కాపాడేందుకు పెన్షన్‌ పథకం ప్రకటించింది. మహావృక్షాలను కాపాడేందుకు రూ. 2,500 వరకు పెన్షన్ ప్రకటించింది. మన ఇంట్లోని వృద్ధులను కాపాడినట్లే ఆ వృక్షాలను కూడా కాపాడుకోవాలని ప్రభుత్వం సూచించింది. చెట్లను కాపాడేందుకు హర్యానా ప్రభుత్వం ‘ప్రాణవాయు దేవత యోజన’ అనే పేరుతో ఓ పథకాన్ని తీసుకొచ్చింది. 75 ఏళ్లు ఆ పై వయసున్న మహా వృక్షాలను కాపాడేందుకుగానూ ఈ కొత్త స్కీమ్‌ను తెచ్చింది. ఈ వృక్షాలను కాపాడేవారికి సంవత్సరానికి రూ.2 వేల 500 పెన్షన్‌ ప్రకటించింది.

ఎన్ని మొక్కలున్నాయంటే(Haryana)

పురాతన చెట్ల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వృక్షాలను గౌరవించాలన్న భావన ప్రజల్లో కలగాలని హర్యానా అటవీశాఖ మంత్రి కన్వర్‌ పాల్‌ గుర్జర్‌ అన్నారు. హర్యానా రాష్ట్ర వ్యాప్తంగా 75 ఏళ్లు పైబడిన 3 వేల 3 వందలు అతిపురాతనమైన వృక్షాలు ఉన్నాయని అటవీశాఖ గుర్తించింది. ప్రభుత్వం తెచ్చిన ఈ పథకం పట్ల ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది.

చెట్లను రక్షించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని.. చెట్లు లేకుంటే మానవ మనుగడే కష్టమని.. వృక్షాలు ప్రజలకు ఎన్నో రకాల మేలు చేస్తున్నాయని హర్యానా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది.  చెట్లకు పెన్షనే కాదు.. మొక్కలను కూడా నాటాలని కూడా సూచించింది. నేటి మొక్కనే రేపటి చెట్లు అనే పిలుపుతో మొక్కలు నాటాలని సూచించింది.