Home / తప్పక చదవాలి
రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్‌తో మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన భేటీ వివరాలపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య లేఖ విడుదల చేశారు. జనసేన బలంగా ఉన్న చోట్ల కనీసం 40 స్థానాలకి తగ్గకుండా చూడాలని పవన్ కళ్యాణ్‌ని కోరానని జోగయ్య వెల్లడించారు.
తిరుపతిలో మాజీ ఎంపీ చింతామోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి కాంగ్రెస్ తరపున తిరుపతి నుంచి పోటీ చేస్తే గెలుపు తథ్యమని జోస్యం చెప్పారు. ఆయన గెలిస్తే ముఖ్యమంత్రిని చేసే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఏపీలో కాంగ్రెస్‌కు 130 అసెంబ్లీ స్థానాలు, 20 పార్లమెంటు సీట్లు వస్తాయని ఆయన అన్నారు.
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో దారుణం చోటు చేసుంది. అచ్చంపేటకు చెందిన సింధు అనే వివాహిత మరణించింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె బంధవులు సింధు మృతికి ఆమె భర్త నాగార్జున కారణమని భావించారు. నాగార్జునను బంధువులు ఆమనగల్ వద్ద ఇనుపరాడ్లతో కొట్టి చంపేశారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని కాంగ్రెస్ నేత షర్మిల కలిశారు. ఈ నెల 18న తన కుమారుడు రాజారెడ్డి- అట్లూరి ప్రియ ఎంగేజ్మెంట్కి, ఫిబ్రవరి 17న జరుగబోయే ఎంగేజ్మెంట్కి రావాలని చంద్రబాబు నాయుడిని వైఎస్ షర్మిల ఆహ్వానించారు. చంద్రబాబు షర్మిలను సాదరంగా ఆహ్వానించారు. తప్పకుండా వివాహానికి హాజరవుతానని చెప్పారు.
బీజేపీతో పొత్తు గతంలో లేదని, భవిష్యత్‌లో కూడా ఉండదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎన్నటికీ బీజేపీకి బి టీం కాదని కెటిఆర్ అన్నారు. భువనగిరి పార్లమెంటు నియోజక వర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలోనే అతి పొడవైన సీ బ్రిడ్జిని ముంబైలో ప్రారంభించారు. కాగా ఈ బ్రిడ్జికి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి పెట్టారు. 21.8 కిలోమీటర్ల ఆరులేన్ల బ్రిడ్జికి 18వేల కోట్ల రూపాయల వ్యయం అయ్యింది. ఒక లక్షా 77వేల 903 మెట్రలిక్ టన్నుల ఉక్కును వినియోగించారు.
ఆసియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పిలువబడే బ్రూనై యువరాజు అబ్దుల్ మతీన్ గురువారం ఒక ఇంటివాడయ్యాడు. అతను అనీషా రోస్నాఅనే సామాన్యురాలిని పెళ్లాడటంతో ఈ వివాహ వేడుక అందరి దృష్టిని ఆకర్షించింది. బందర్ సెరీ బెగవాన్‌లోని బంగారు గోపురం సుల్తాన్ ఒమర్ అలీ సైఫుద్దీన్ మసీదులో ఈ వివాహం జరిగింది.
తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. అస్సాంవాసులు తిరుమలలోని మోకాళ్ళ పర్వతంపై డ్రోన్‌తో వీడియో తీశారు. మోకాళ్ళ పర్వత ప్రాంతం, ఘాట్ రోడ్డులను అస్సాం వాసులు షూట్ చేశారు.అస్సాంకు చెందిన దంపతులిద్దరూ కారులో మోకాళ్ళ పర్వతంపైకి వచ్చి డ్రోన్‌ను వినియోగించారు.
భువనగిరి పార్లమెంట్ నేతల సమావేశంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కారు షెడ్డుకు వెళ్లలేదు సర్వీసింగ్ కు మాత్రమే వెళ్ళిందని కేటీఆర్ అన్నారు. పరిపాలన మీద దృష్టిపెట్టి పార్టీని పట్టించుకోలేదు.. ఇందుకు పూర్తి బాద్యత తనదేనని కేటీఆర్ అంగీకరించారు.
జనవరి 22న జరిగే రామ మందిర ప్రతిష్ఠాపన కోసం ఉజ్జయిని మహాకాళేశ్వర క్షేత్రం నుంచి ఐదు లక్షల లడ్డూలను అయోధ్యకు పంపనున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ శుక్రవారం తెలిపారు.స్వామి వివేకానంద దినోత్సవం సందర్బంగా ఒక పాఠశాలలో ఆయన మంత్రులతో కలిసి సూర్య నమస్కారాలు నిర్వహించారు.