Home / తప్పక చదవాలి
తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. ఈ మేరకు రాష్ట్రంలో 12వేల, 400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకు వచ్చింది. దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డితో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రంలోని పలు రంగాల్లో 12వేల, 400 కోట్లు పెట్టుబడులకు సంబంధించిన నాలుగు అవగాహన ఒప్పందాలను తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకుంది.
అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రసాదం లడ్డూను ఏర్పాటు చేసే అవకాశం సికింద్రాబాద్ మారేడ్ పల్లి వాసి నాగభూషణం రెడ్డికి చెందిన శ్రీరామ క్యాటరింగ్ సర్వీసెస్ దక్కించుకుంది. ఈ మేరకు 12వందల 65 కిలోల లడ్డూను, ప్రత్యేక వాహనాన్ని అయోధ్యకు పంపించడానికి సిద్దం చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని మథుర కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా కాంప్లెక్స్‌లో సర్వే చేసేందుకు అడ్వకేట్ కమిషన్‌ను నియమించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు మంగళవారం నిలిపివేసింది. కమీషన్ నియామకాన్ని అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు డిసెంబర్ 14న ఉత్తర్వులు జారీ చేసింది.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో సంక్షోభం నెలకొంది. పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ సోమవారం నుండి నిరవధికంగా మూతపడింది. దీంతో వేలాది మంది పవర్‌లూమ్స్, చేనేత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా టెక్స్టైల్ రంగంలో నెలకొన్న సంక్షోభం, కొత్త ఆర్డర్లు లేకపోవడం పెరిగిన విద్యుత్ ఛార్జీలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వస్త్ర పరిశ్రమ యజమానులు చెబుతున్నారు.
కేరళ లోని పతనంతిట్ట కొండపై ఉన్న శబరిమల ఆలయానికి సోమవారం భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తి 'మకర జ్యోతిని ' దర్శనం చేసుకున్నారు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తుల నామస్మరణతో ఆ ప్రాంతం మొత్తం మార్మోగిపోయింది. జ్యోతి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు.
ఛాబహార్ ఓడరేవును మరింత అభివృద్ధి చేయడానికి భారతదేశం, ఇరాన్ సోమవారం ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. విదేశాంగ మంత్రి జై శంకర్ టెహ్రాన్ పర్యటన సందర్భంగా ఇరాన్ రోడ్లు మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మెహర్దాద్ బజర్పాష్‌తో విస్తృత చర్చలు జరిపిన నేపధ్యంలో ఈ ఒప్పందం కుదిరింది. జైశంకర్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేసారు.
కుండపోత వర్షాల కారణంగా రియో డి జెనీరోలో 11 మంది మరణించారని అగ్నిమాపక శాఖ తెలిపింది.తుఫాను ప్రభావంతో రియోలోని ఉత్తర ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, విద్యుదాఘాతాలతో ప్రజలుమరణించారు. పెద్ద సంఖ్యలో పలువురు గాయపడ్డారు. అవెనిడా డి బ్రెసిల్లోని కొన్ని ప్రాంతాలలో కార్లు నీటిలో తేలాయి.
జనవరి 22న జరగనున్న అయోధ్యలోని రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం ద్వారా లక్ష కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఎఐటి) నివేదిక వెల్లడించింది. వివిధ రాష్ట్రాల్లోని 30 నగరాల్లోని వర్తక సంఘాల నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ అంచనా వేయబడింది.
తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయింది. దామోదర రాజనరసింహ ఫేస్ బుక్ లో కొంతమందిబీజేపీ, టీడీపీ, తమిళనాడు లోని రాజకీయ పార్టీలకు చెందిన పోస్టులు పెట్టారు. కొందరు నాయకులు దామోదరకు కాల్ చేసి విషయాన్ని చెప్పారు.
ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రుద్రరాజు రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. ఒకటి, రెండు రోజుల్లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది.