Last Updated:

Harirama Jogaiah: పవన్ సీఎం అంటేనే ఓటు బదిలీ అవుతుంది.. హరిరామ జోగయ్య.

రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్‌తో మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన భేటీ వివరాలపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య లేఖ విడుదల చేశారు. జనసేన బలంగా ఉన్న చోట్ల కనీసం 40 స్థానాలకి తగ్గకుండా చూడాలని పవన్ కళ్యాణ్‌ని కోరానని జోగయ్య వెల్లడించారు.

Harirama Jogaiah: పవన్ సీఎం అంటేనే ఓటు  బదిలీ అవుతుంది.. హరిరామ జోగయ్య.

 Harirama Jogaiah: రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్‌తో మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన భేటీ వివరాలపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య లేఖ విడుదల చేశారు. జనసేన బలంగా ఉన్న చోట్ల కనీసం 40 స్థానాలకి తగ్గకుండా చూడాలని పవన్ కళ్యాణ్‌ని కోరానని జోగయ్య వెల్లడించారు.

అధికార పంపిణీ జరగాలి..( Harirama Jogaiah)

దీనికి పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారని, తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారని జోగయ్య తెలిపారు. పొత్తులో భాగంగా జనసేన- టిడిపి మధ్య అధికార పంపిణీ సవ్యంగా జరగాలని పవన్ కళ్యాణ్‌కి చెప్పానని జోగయ్య చెప్పారు. అందులో భాగంగా రెండున్నర సంవత్సరాలైనా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండాలని, అప్పుడే ఓట్ ట్రాన్స్‌ఫర్ అవుతుందని చెప్పానని జోగయ్య అన్నారు. జనసైనికుల ఆకాంక్షలకి అనుగుణంగానే అధికార పదవుల పంపిణీ ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారని జోగయ్య వివరించారు. జనసేన తరపున పవన్ కళ్యాణ్ పోటీ చేయాల్సిన నియోజకవర్గం గురించి కూడా మాట్లాడానని జోగయ్య తెలిపారు. నర్సాపురం, భీమవరం, తాడేపల్లి గూడెంలో ఏదో ఒక నియోజకవర్గాన్ని ఎంచుకోవాలని సూచించానని జోగయ్య పేర్కొన్నారు. ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు బీజేపీని కూడా కలుపుకుని ముందుకు తీసుకు వెళ్ళాలని చెప్పానని జోగయ్య అన్నారు. జనసేన-టీడీపీ కూటమితో బిజెపి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పవన్ తనతో అన్నారని జోగయ్య చెప్పారు.