Last Updated:

Tata Upcoming EV: మీరు టాటా లవర్సా..? అయితే కొద్ది రోజులు ఆగండి.. త్వరలో పిచ్చెక్కించే కార్లు వస్తున్నాయ్..!

Tata Upcoming EV: మీరు టాటా లవర్సా..? అయితే కొద్ది రోజులు ఆగండి.. త్వరలో పిచ్చెక్కించే కార్లు వస్తున్నాయ్..!

Tata Upcoming EV: దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు టాటా మోటార్స్ EV సెగ్మెంట్‌లో తన పట్టును బలోపేతం చేయడానికి ఈ సంవత్సరం అనేక కొత్త మోడళ్లను విడుదల చేయబోతోంది. మీరు శక్తివంతమైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కొనాలని ఆలోచిస్తున్నట్లయితే కొద్ది  రోజులు ఆగండి. ఈ సంవత్సరం కంపెనీ సఫారీ ఈవీ, సియెర్రా ఈవీ, హారియర్ ఈవీలను ప్రారంభించవచ్చు. ఈ క్రమంలో వాటి ధర, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

Tata Safari EV
టాటా మోటార్స్ తమ సఫారీ ఎలక్ట్రిక్‌ను భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2025లో కంపెనీ ఈ వాహనాన్ని ఆవిష్కరించింది. కొత్త సఫారీ ధర ఈ నెలలో ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ఈవీ ఫుల్ ఛార్జింగ్ పై 550 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. సఫారి EV  ఇంటీరియర్ నుండి డిజైన్‌లో ప్రధాన మార్పులు చూడవచ్చు. సఫారీ ఈవీ రూ. 21 లక్షలతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Tata Harrier EV
టాటా మోటార్స్ తన హారియర్ ఎలక్ట్రిక్‌తో పెర్కోడాను కూడా ఈ సంవత్సరం విడుదల చేయవచ్చు. హారియర్ ఈవీ ఫుల్ ఛార్జింగ్ పై 450-550 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఇందులో డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ సెటప్ ఉంటుంది. అయితే దాని ఎంట్రీ లెవల్ వేరియంట్‌లో ఒకే మోటార్‌ను చూడొచ్చు. హారియర్ ఈవీ డిజైన్‌లో కొన్ని మార్పులు చూడచ్చు. దీనితో పాటు హారియర్ పెట్రోల్‌ను కూడా మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనుంది. కొత్త మోడల్‌లో ఈసారి చాలా పెద్ద మార్పులను చూడవచ్చు. హారియర్ EV  అంచనా ధర రూ. 19 నుండి రూ. 20 లక్షల వరకు ఉండవచ్చు.

Tata Sierra EV
టాటా మోటార్స్ తన అత్యంత ప్రజాదరణ పొందిన SUV సియెర్రాను మళ్లీ మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. ఈసారి సియెర్రా పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో విడుదల కానుంది. సియెర్రా ICE వెర్షన్ 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో రావచ్చు. ఈ ఇంజన్ 170 పిఎస్ పవర్,  280న్యూటాన్ మీటర్ టార్క్‌ను అందించగలదు. మరో 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ కూడా ఇందులో చూడవచ్చు. సియెర్రా EV‌లో 60-80 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఈ బ్యాటరీ 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది. సియెర్రా EV అంచనా ధర రూ. 20 నుండి 22 లక్షలు ఉండవచ్చు.