BJP: తెలంగాణలో నూతన అధ్యక్షులు.. 27 జిల్లాలకు కొత్త బాస్‌లను ప్రకటించిన బీజేపీ
BJP Announces District Presidents for 27 Districts in Telangana: తెలంగాణలోని పలు జిల్లాలకు అధ్యక్షుల పేర్లను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు 27 జిల్లాలకు అధ్యక్షులు ప్రకటించింది. జిల్లా రిటర్నింగ్ అధికారి ద్వారా కొత్త అధ్యక్షుడికి సమాచారం అందించారు. అయితే ఉదయం వాట్సప్ ద్వారా నూతన అధ్యక్షులకు జిల్లా రిటర్నింగ్ అధికారులు నియామక పత్రాలను పంపించారు. కాగా, జిల్లా అధ్యక్షుల ఎన్నికల్లో సామాజిక సమీకరణాలను బీజేపీ పాటించింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత జిల్లా అధ్యక్షుల జాబితాను అధికారికంగా బీజేపీ అధిష్టానం ప్రకటించనుంది. అయితే బీజేపీ సంస్థాగతంగా 38 జిల్లాలు ఉండగా.. ప్రస్తుతం 27 జిల్లాలకు సంబంధించిన నూతన అధ్యక్షుల పేర్లను ఖరారు చేసింది. కాగా, మిగతా 11 జిల్లాలకు కొత్త రాష్ట్ర అధ్యక్షుడి నియామకం జరిగిన తర్వాత ఖరారు చేసే అవకాశం ఉంది.
అధ్యక్షులు వీళ్లే..
1. జనగామ జిల్లా – సౌడ రమేశ్,
2. వరంగల్ – గంట రవి,
3. హనుమకొండ – సంతోష్ రెడ్డి,
4. భూపాలపల్లి – నిశిధర్ రెడ్డి,
5. నల్గొండ – నాగం వర్షిత్ రెడ్డి,
6. నిజామాబాద్ – దినేష్ కులాచారి,
7. వనపర్తి – నారాయణ,
8. హైదరాబాద్ సెంట్రల్ – దీపక్ రెడ్డి,
9. మేడ్చల్ రూరల్ – శ్రీనివాస్,
10. ఆసిఫాబాద్ – శ్రీశైలం ముదిరాజ్,
11. కామారెడ్డి – నీలం చిన్నరాజులు,
12. ములుగు – బలరాం,
13. మహబూబ్ నగర్ – శ్రీనివాస్ రెడ్డి,
14. జగిత్యాల – యాదగిరి బాబు,
15. మంచిర్యాల – వెంటేశ్వర్లు గౌడ్,
16. పెద్దపల్లి – సంజీవరెడ్డి,
17. ఆదిలాబాద్ – బ్రహ్మానందరెడ్డి,
18. సికింద్రాబాద్ – మహంకాళి భరత్ గౌడ్,
19. భువనగిరి – అశోక్ గౌడ్ ,
20. సిద్దిపేట – మోహన్ రెడ్డి,
21. గోల్కొండ – ఉమామహేందర్,
22. భాగ్యనగర్ – శేఖర్ చంద్ర,
23. ఖమ్మం – రవి కుమార్,
24. మహబూబ్ బాద్ – వెంకటేశ్వర్లు,
25. మెదక్ – మహేష్ గౌడ్,
26. సంగారెడ్డి – గోదావరి అంజిరెడ్డి.
27.సిరిసిల్ల – మధుకర్