Home / తప్పక చదవాలి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలో ప్రత్యేకంగా శాకాహార వంటకాలను అందించే ప్రపంచంలోనే మొట్టమొదటి ఏడు నక్షత్రాల హోటల్‌ను నిర్మించాలనే ప్రతిపాదన రాష్ట్రానికి అందిందని ప్రకటించారు.అయోధ్యలో హోటళ్లను ఏర్పాటు చేసేందుకు 25 ప్రతిపాదనలు అందాయి. స్వచ్ఛమైన శాకాహార సెవెన్ స్టార్ హోటల్‌ను నిర్మించాలనేది ప్రతిపాదనల్లో ఒకటి అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఇటీవలే అయోధ్యలో స్థలాన్ని కొనుగోలు చేశారు. ముంబైకి చెందిన డెవలపర్ ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా (HoABL) ద్వారా అయోధ్యలోని 7-స్టార్ మిక్స్డ్ యూజ్ ఎన్క్లేవ్ అయిన ది సరయులో అమితాబ్ ఈ స్దలాన్ని కొన్నారు.
విమానం ఆలస్యంగా బయలుదేరుతుందంటూ ప్రకటన చేస్తున్న ఇండిగో పైలట్‌ను ఒక ప్రయాణికుడు ఢీకొట్టిన ఘటనపై ఢిల్లీ పోలీసులు చట్టపరమైన చర్యలను ప్రారంభించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు దీనిపై ప్రయాణీకుడిని తప్పుబట్టారు.
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని అధికారిక బృందం వెళ్లింది. ఈ నెల 19 వరకూ ఈ సదస్సు జరగనుండగా రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం రాత్రి ఉండవల్లిలోని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఇంటికి వెళ్లారు. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ డిన్నర్ చేయనున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోతోపాటు అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. సోమవారం టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితాని విడుదల చేసే అవకాశాలున్నాయి.
ఏపీలో అధికార వైసీపీ పార్టీకీ మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి రాజీనామా చేశారు. త్వరలో జనసేనలో చేరుతున్నానని బాలశౌరి ట్వీట్ చేశారు. కొద్ది రోజులుగా తనకి పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని బాలశౌరి మనస్తాపంతో ఉన్నారు.
అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి రామ్‌చరణ్ దంపతులకు ఆహ్వానం అందింది. హైదరాబాద్‌లోని రామ్ చరణ్ నివాసానికి వెళ్లి ట్రస్టు ప్రతినిధులు ఆహ్వాన పత్రికను అందించారు. ఈ నెల 22న జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని ట్రస్టు ప్రతినిధులు ఆహ్వానించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ప్రతిపక్ష నేతృత్వంలోని ఇండియా బ్లాక్‌కు చైర్మన్‌గా శనివారం నియమించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.సీటు షేరింగ్ ఎజెండా, "భారత్ జోడో న్యాయ్ యాత్ర"లో పాల్గొనడం మరియు కూటమికి సంబంధించిన ఇతర విషయాలను సమీక్షించడానికి ఇండియా బ్లాక్ నాయకులు వర్చువల్ మీటింగ్‌ను ఈరోజు నిర్వహించారు.
సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో పది మంది మరణించగా, మరో ఆరుగురు తప్పిపోయినట్లు స్థానిక అధికారులు శనివారం తెలిపారు. దీనిని బొగ్గు మరియు గ్యాస్ పేలుడు విస్ఫోటనం గా వర్ణించారు. శుక్రవారం మధ్యాహ్నం 2:55 గంటలకు పింగ్డింగ్షాన్లో ఈ ప్రమాదం జరిగింది.
నేపాల్‌లోని లుంబినీ ప్రావిన్స్‌లో ఉన్న రప్తి నదిలో శుక్రవారం ప్రయాణీకుల బస్సు పడిపోవడంతో ఇద్దరు భారతీయులతో సహా కనీసం 12 మంది మరణించారు. ఖాట్మండు పోస్ట్ ప్రకారం, బస్సు నేపాల్‌గంజ్ నుండి ఖాట్మండుకు వెళుతుండగా, భలుబాంగ్‌లోని రప్తి వంతెనపై నుండి ఈస్ట్-వెస్ట్ హైవే వెంబడి నదిలోకి పడిపోయింది.