Last Updated:

Palnadu District: నా పెళ్లాం నగలు తాకట్టు పెట్టి యాత్ర సినిమా వారం రోజులు ఆడించాను.. వైసీపీ నేత గాదె వెంకటరెడ్డి

పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే శంక‌ర్‌రావు తీరును నిరసిస్తూ బెల్లంకొండ జెడ్పీటీసీ గాదె వెంకటరెడ్డి ధర్నాకు దిగారు.

Palnadu District: నా పెళ్లాం నగలు తాకట్టు పెట్టి యాత్ర సినిమా వారం రోజులు ఆడించాను.. వైసీపీ నేత  గాదె వెంకటరెడ్డి

Palnadu District: పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే శంక‌ర్‌రావు తీరును నిరసిస్తూ బెల్లంకొండ జెడ్పీటీసీ గాదె వెంకటరెడ్డి ధర్నాకు దిగారు. వైసీపీ అంటే పిచ్చి అభిమానంతో పార్టీలో చేరి పూర్తిగా నష్టపోయానన్నారు. వైసీపీ కోసం కోటి రూపాయలకు పైగా ఖర్చు చేశానన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జెడ్పీటీసీగా గెలిచానని.. పార్టీ కోసం 70 ఎకరాల భూమిని అమ్ముకున్నానని ఆవేదన వ్య‌క్తంచేశారు.

వైసీపీ అంటే పిచ్చి అభిమానంతో పార్టీలో చేరామని, ‘యాత్ర’ సినిమా ప్రదర్శన కోసం బంగారం తాకట్టు పెట్టి మరీ సినిమా హాలు అద్దెకు తీసుకొని ప్రదర్శించామని చెప్పారు. వైసీపీ అధికారంలోకి రావడానికి ఎన్నికల సమయంలో రూ. కోటికి పైగా ఖర్చు పెట్టానన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక బెల్లంకొండ మండలం జడ్పీటీసీగా గెలిచానన్నారు. పార్టీ కోసం తనకున్న 70 ఎకరాలకు పైగా అమ్మానన్నారు. ఈ నాలుగేళ్ళల్లో తన సొంత సమస్యలే పరిష్కారం చేసుకోలేకపోయానన్నారు. ఇంత చేసినా పార్టీ తనకు ఏం న్యాయం చేసిందని ప్రశ్నించారు గాదె వెంక‌ట‌రెడ్డి. బోర్ బండి కూడా అమ్మేసుకున్నానన్నారు. తన 35 ఎకరాలు చుక్కల భూమిగా మారిందని, దాన్ని సరిచేయాలని ఎమ్మెల్యేను, ఎంపీని కోరినా న్యాయం చేయడం లేదన్నారు. వీడికి ఆ భూమి వస్తే తిరిగి డబ్బులు వస్తాయి, పార్టీలో హవా చెలాయిస్తారనే కుట్ర‌తో న్యాయం చేయడం లేదన్నారు.

ఓటు వేయించిన తమను ప్రజలను నిలదీస్తుంటే సమాధానం చెప్పలేకపోతున్నామన్నారు. జనంలో చేతగాని వాళ్లుగా మారి తిట్లు తింటూ బతుకుతున్నామన్నామని ఆవేదన వ్య‌క్తం చేశారు. ఎమ్మార్వో అస్సలు పని చేయడం లేదని, ఆయన్ను మార్చాలని కోరినా ఎమ్మెల్యే వినిపించుకోదన్నారు. పార్టీకి ద్రోహం చేసిన వారినే ప్రోత్సహిస్తున్నారని.. తమలాంటి వారు నిజాయితీగా పనిచేసి నాశనం అయిపోయామన్నారు. అప్పులు తెచ్చి పార్టీ కోసం ఖర్చు పెట్టానని.. ఇప్పుడు అప్పుల వాళ్లు మీద పడుతుంటే పురుగుల మందు తాగి చావాలనిపిస్తోందన్నారు. వాటర్ ట్యాంక్ నిర్మించిన బిల్లుతో పాటు.. బోర్లు వేసిన బిల్లులు కూడా తనకు ఇవ్వడం లేదన్నారు. తనను నమ్మి గెలిపించిన ప్రజల సమస్యలను ఎలా తీర్చాలన్నారు. అధికారులకు ఎన్ని సార్లు చెబుతున్నా పట్టించుకోవడంలేదని, సమస్యలు తీరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ప్రోత్సహిస్తున్నారని గాదె వెంకటరెడ్డి అన్నారు.

ఇవి కూడా చదవండి: