Kakani : అడ్రస్ లేని మాజీ మంత్రి కాకాణి.. పోలీసుల గాలింపు

Kakani : వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పరారీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు దొరకడం లేదు. ఆదివారం నెల్లూరులోని ఆయన ఇంటికి పోలీసులు నోటీసులు తీసుకొని వెళ్లారు. ఆ సమయంలో అందుబాటులో లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించి వెళ్లిపోయారు. మరోవైపు హైదరాబాద్‌లో ఉన్నట్లు సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలుసుకున్నారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. అక్కడ కూడా ఆయన అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు.
కాకాణి గోవర్ధన్ రెడ్డి విచారణ రేపటికి వాయిదా పడింది. నేడు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి విచారణకు రావాలని నిన్న పోలీసులు నోటీసులు జారీ చేశారు. నోటీసుల ప్రకారం ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉండగా, కాకాణి మాత్రం హాజరుకాలేదు. ఆదివారం నెల్లూరులోని కాకాణి ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. ఇవాళ హైదరాబాద్‌లోని కాకాణి నివాసానికి వెళ్లారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి అక్కడ కూడా అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు నేపథ్యంలో కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఇప్పటికే హైకోర్టులో బెయిల్ పిటిషన్ తోపాటు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రేపు హైకోర్టులో కాకాణి బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. మరోవైపు నెల్లూరుతోపాటు హైదరాబాద్‌లో కూడా కాకాణి లేకపోవడంతో ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నట్లుగా తెలుస్తోంది.
చెన్నైలో నివాసం ఉండే విద్యాకిరణ్‌కు పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామ సమీపంలోని 32 ఎకరాల్లో రుస్తుం మైన్ పేరిట మైకా తవ్వకాలకు అనుమతి ఉండగా, లీజు గడువు ముగియడంతో పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తెల్లరాయి గనులపై ఆ పార్టీ నేతలు కన్నేశారని, లీజుదారుడు అంగీకరించకపోయినా కొందరు ప్రజాప్రతినిధుల అండతో దౌర్జన్యంగా తెల్లరాయిని తరలించారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో మంత్రిగా ఉన్న కాకాణి సొంత గ్రామం తోడేరుకు సమీపంలో మైనింగ్‌కు పాల్పడినట్లు విమర్శలు ఉన్నాయి. దీనిపై టీడీపీకి చెందిన మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే.