Last Updated:

Traffic Rules: వాహనదారులకు అలెర్ట్.. ఆ మార్గాల్లో వెళ్లకండి

రంజాన్ నెల చివరి శుక్రవారం సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Traffic Rules: వాహనదారులకు అలెర్ట్.. ఆ మార్గాల్లో వెళ్లకండి

Traffic Rules: రంజాన్ నెల చివరి శుక్రవారం సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ సుధీర్ బాబు ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో పాతబస్తీతో పాటు సికింద్రాబాద్ ప్రాంతంలోనే ట్రాఫిక్ ఆంక్షలు వర్థిస్తాయి. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిబంధనలు అమలులో ఉంటాయి.

 

ఈ మార్గాల్లో మూసివేత(Traffic Rules)

మక్కా మసీదులో జరిగే ప్రార్థనల కారణంగా.. చార్మినార్‌, మదీనా, ముర్గీ చౌక్, రాజేష్‌ మెడికల్‌ హాల్‌ (శాలిబండ) మధ్య రోడ్లు మధ్యాహ్నం 3 గంటల వరకు పూర్తిగా మూసివేస్తారు. ఈ మార్గాల్లోకి ఎలాంటి వాహనాలు అనుమతించరు. ప్రార్థనలకు హాజరయ్యే వారి కోసం గుల్జార్‌ ఫంక్షన్‌ హాల్, చార్మినార్‌ బస్‌ టెర్మినల్‌ పార్కింగ్, సర్దార్‌ మహల్‌ సహా 7 ప్రాంతాల్లో పార్కింగ్‌ సదుపాయం కల్పించారు. అదే సమయంలో సికింద్రాబాద్‌లోని సుభాష్‌ రోడ్‌ కూడా మూసేస్తారు. వాహనదారులు ప్రత్యా మ్నాయ మార్గాలు చూసుకోవాలని కోరారు. ఈ ఆంక్షలు, మళ్లింపులు ఆర్టీసీ బస్సులకు కూడా వర్తించనున్నాయి. ఏలాంటి సహాయం అవసరమైనా ‘9010203626’ నంబర్‌లో సంప్రదించాలని ట్రాఫిక్ కమిషనర్ సూచించారు.

 

మళ్లింపులు(Traffic Rules)

అదే విధంగా ప్రార్థనల సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో మళ్లింపులు ఉండనున్నాయి. నయాపూర్ నుంచి చార్మినార్ వైపు వచ్చే వాహనాలను మదీనా జంక్షన్ నుంచి సిటీ కాలే్ వైపు మళ్లిస్తారు. నాగుల చింత, శాలిబండ నుంచి చార్మినార్ వచ్చే వాహనాలను హిమ్మతఖ్ పుర జంక్షన్ దగ్గర మళ్లించి హరిబౌలి, వోల్గా హోటల్ టీ జంక్షన్ వైపు పంపిస్తారు. అలీజా కోట్ల నుంచి చార్మినార్ వచ్చే వాహనాల్ని చౌక్ మైదాన్ మీదుగా ఆర్మాన్ హోటల్ వైపు మళ్లిస్తారు. మౌసాబౌలి నుంచి చార్మినార్ వైపు వచ్చే వాహనాల్ని మోతీ గల్లీ దగ్గర ఖిల్వత్ గ్రౌండ్ , రాజేశ్ మెడికల్ హాల్ , ఫతే దర్వాజా రోడ్డు వైపు మళ్లిస్తారు. ఎతేబార్ చౌక్ నుంచి గుల్జార్ హౌస్ వైపు వచ్చే వాహనాల్ని మీర్ ఆలం వైపు మళ్లిస్తారు.