Published On:

Nagarjuna: అక్కినేని అఖిల్ పెళ్లి.. సీఎం రేవంత్ ను కలిసిన హీరో నాగార్జున

Nagarjuna: అక్కినేని అఖిల్ పెళ్లి.. సీఎం రేవంత్ ను కలిసిన హీరో నాగార్జున

CM Revanth: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున దంపతులు సీఎం రేవంత్ రెడ్జిని ఇవాళ ఆయన నివాసంలో కలిశారు. తమ చిన్న కుమారుడు అఖిల్ వివాహ వేడుక సందర్భంగా పెళ్లికి రావాలని ఆహ్వానించారు. అయితే అక్కినేని అఖిల్, ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్తె జైనాబ్ రవ్జీల పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిందని సమాచారం. వీరిద్దరి పెళ్లి జూన్ 6 జరగనుందని టాలీవుడ్ లో జోరుగా ప్రచారం నడుస్తోంది.

 

కాగా సీఎం రేవంత్ రెడ్డిని అక్కినేని నాగార్జున దంపతులు కలిసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇక అఖిల్, జైనాబ్ రవ్జీ పెళ్లి అన్నపూర్ణ స్టూడియోలోనే సింపుల్ గా జరగబోతున్నట్టు సమాచారం. కానీ అఖిల్ పెళ్లి తేదీని అక్కినేని ఫ్యామిలీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.