Last Updated:

MLC Kavitha: టార్గెట్ కవిత.. ఈడీ సోదాల లక్ష్యం ఇదేనా?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు పెంచింది. దేశ వ్యాప్తంగా ఏకకాలంలో 30 చోట్ల తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్‌లోనూ ఎమ్మెల్సీ కవిత అనుచరులైన, బోయినపల్లి అభిషేక్ రావ్, సూదిని సృజనా రెడ్డి, గండ్ర ప్రేమ్ సాగర్ ఇల్లు కార్యాలయాల పై దాడులు కొనసాగుతున్నాయి.

MLC Kavitha: టార్గెట్ కవిత.. ఈడీ సోదాల లక్ష్యం ఇదేనా?

Hyderabad: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు పెంచింది. దేశ వ్యాప్తంగా ఏకకాలంలో 30 చోట్ల తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్‌లోనూ ఎమ్మెల్సీ కవిత అనుచరులైన, బోయినపల్లి అభిషేక్ రావ్, సూదిని సృజనా రెడ్డి, గండ్ర ప్రేమ్ సాగర్ ఇల్లు కార్యాలయాల పై దాడులు కొనసాగుతున్నాయి. దీన్నిబట్టి చూస్తే టార్గెట్ కవిత, తాజా ఈడీ సోదాలు లక్ష్యం ఇదేనా?

దాదాపు రెండు వారాల క్రితం ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ వ్యవహారం సంచలనంగా మారింది. దీని ప్రకంపనలు నేరుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత మీదకు వచ్చాయి. ఆ తర్వాత బీజేపీ నేతలు కవిత మీద తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేశారు. దీంతో కోర్టును ఆశ్రయించిన కవిత తన మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ పేర్కొనటం. అనవసర వ్యాఖ్యలు చేయకుండా కోర్టు ఆదేశాల్ని తెచ్చుకోవటం తెలిసిందే. ఇదిలా ఉంటే, ఈడీ బోడీలకు తాము భయపడమని, మిగిలిన రాష్ట్రాల్లో మాదిరి తెలంగాణలో కుదరదంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం వార్నింగ్‌ ఇచ్చారు. అలాగే సీబీఐకి తెలంగాణలో నో ఎంట్రీ అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. మీడియాతో మాట్లాడిన సందర్భంగా కవిత సైతం, ఈడీ బోడీ అంటూ తేలిగ్గా తీసేయటం కనిపించింది. అదే సమయంలో బీజేపీ నేతలు సైతం మౌనంగా ఉండటం కూడా కనిపించినప్పుడు అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

ఈ పరిస్థితుల్లో మంగళవారం ఉదయం దేశ వ్యాప్తంగా దాదాపు 30 చోట్లకు పైనే ఈడీ సోదాలు నిర్వహిస్తున్న వైనం బయటకు వచ్చి సంచలనంగా మారింది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఒకే సమయంలో ఈడీ సోదాలకు దిగటం. అందులో ఢిల్లీ, హైదరాబాద్, లక్నో, గురుగావ్, బెంగళూరు, చెన్నై లాంటి ముఖ్య నగరాల్లో తనిఖీల్ని నిర్వహించారు. ఒక్క హైదరాబాద్ లోనే ఆరు చోట్ల సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. అధికారుల ఫోకస్ మొత్తం రాబిన్ డిస్టిలర్స్ పేరుతో బిజినెస్ నిర్వహిస్తున్న రామచంద్రన్ పిళ్లైపైనే పెట్టారు. ఆయన నివాసంలోనూ తనిఖీలు నిర్వహించారు. వీరితో పాటు మరో ఐదుగురు ఇళ్లల్లో కూడా సోదాలు నిర్వహించారు. బోయినపల్లి అభిషేక్ రావు, సూదిని సృజన్ రెడ్డి, గండ్ర పేమ్ సాగర్ నివాసాలు, ఆఫీసులకు ఈడీ అధికారులు వెళ్లినట్లుగా తెలుస్తోంది. సూదిని సృజన్ రెడ్డి రేవంత్‌రెడ్డికి బంధువు కావడం గమనార్హం.

అభిషేక్‌రావు, ప్రేమ్ సాగర్ రావు కవిత వద్ద పని చేస్తారని చెబుతున్నారు. తాజాగా జరుగుతున్న తనిఖీలు మొత్తం కవితకు సన్నిహితంగా ఉన్న వారే లక్ష్యంగా జరుగుతున్నట్లుగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు రెండు వారాల మౌనం తర్వాత, పక్కా గ్రౌండ్ వర్కుతో తాజా దాడులు జరుగుతున్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఏమైనా తాజా సోదాలతో రాజకీయ సంచలనం అంతో ఇంతో ఖాయమన్న మాట వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి: