Published On:

Rains in Telangana: వాతావరణశాఖ హెచ్చరిక.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు

Rains in Telangana: వాతావరణశాఖ హెచ్చరిక.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు

4 Days Rain expected to Telangana State:  తెలంగాణకు వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది. వచ్చే నాలుగు రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. అయితే రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు తాళలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక చిన్నారులు, వృద్ధుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

 

అయితే ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ చెప్పింది. ఉరుములు, మెరుపులు, పిడుగులు, భారీ ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాలతో పాటు నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఇవాళ గంటకు 40- 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

 

ఇక మంగళవారం రోజున ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో బలమైన గాలులు వీస్తాయని చెప్పింది. అలాగే పిడుగలతో కూడిన వర్షం పడుతుందని తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది.

 

బుధ, గురువారాల్లో నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులతో భారీ వర్షాలు పడతాయని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది.