Home / Weather Updates
తెలుగురాష్ట్రాల్లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం తొమ్మిది పదిగంటలైనా పొగమంచు వీడడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో చలి పంజా విసురుతున్నది.
తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. కాగా రాగల మూడురోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో మరో మూడు రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
గత కొద్దిరోజులుగా అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరల అమరావతి వాతావరణ కేంద్రం ఏపీకి మరో మూడురోజుల పాటు వర్ష సూచన ఉందని తెలిపింది. నేడు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొనింది.
రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మళ్లీ కారు మేఘాలు కమ్ముకున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.