Home / తెలంగాణ
హైదరాబాద్‌లోని మాదాపూర్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్లో రేవ్‌పార్టీని నార్కోటిక్స్ బ్యూరో అధికారులు భగ్నం చేశారు. రేవ్ పార్టీని నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రేవ్ పార్టీలో పాల్గొన్న వారి నుంచి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు
తెలంగాణలో ఉపాధ్యాయులకి హైకోర్టు శుభవార్త చెప్పింది. ఉపాధ్యాయుల బదిలీలకి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తుది తీర్పులకు లోబడి బదిలీలు ఉండాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. టీచర్ల బదిలీలపై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులని హైకోర్టు సవరించింది.
ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు ఊహించని షాక్ తగిలింది. టీటీడీ గతంలో అతిథి గృహం నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆ స్థలాన్ని కాటేజ్ డొనేషన్ పథకం కింద కొత్త దాతకు కేటాయించాలని యోచిస్తోందని తెలుస్తుంది. వెంకట విజయం అతిథి గృహం పునర్నిర్మాణం లేదా పునర్నిర్మాణం
జగిత్యాల జిల్లా కోరుట్లలో తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మరణించిన బంకి దీప్తి కేసులో పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేశారు. సిసి కెమెరాలు, సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు బృందాలు ముందుకు సాగుతున్నాయి.
ఏపీ, తెలంగాణలో పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అవసరాన్ని బట్టి పొత్తులు ఉంటాయన్న చంద్రబాబు, తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు. తెలంగాణలో బీజేపీతో పొత్తులపై చర్చలకు సమయం మించిపోయిందని చంద్రబాబు అన్నారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన ప్రాణం ఉన్నంత వరకు తాను బీజేపీలోనే ఉంటానన్నారు. ఒకవేళ బీజేపీ తనపై సస్పెన్షన్ ఎత్తివేయకపోతే తాను కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. తాను హిందువాదినని రాజాసింగ్ తెలిపారు.
ఏపీ మంత్రి రోజా భర్త సెల్వమణి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగుతోపాటు తమిళంలోనూ పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్, ఫెఫ్సీ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే తాజాగా సెల్వమణిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
ఖమ్మం జిల్లా నాయకన్ గూడెం వద్ద జరిగిన టీచర్ బైరోజు వెంకటాచారి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 15 లక్షలు సుపారీ ఇచ్చి కిరాయి హంతకులతో చంపించారని పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని హతుడు వెంకటాచారి స్నేహితుడు గిరిధర్ రెడ్డిగా నిర్థారించారు.
ఎన్టీఆర్.. ఒక వైపు సినిమాల్లోనూ.. మరోవైపు రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేకంగా ఒక చెరగని ముద్ర వేసుకొని తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. కాగా అటువంటి గొప్ప వ్యక్తి శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ముర్ము తాజాగా విడుదల చేశారు. ఎన్టీఆర్ 100 రూపాయల స్మారక
చట్టానికి ప్రతినిధి అయిన ఆ సబ్ ఇన్స్పెక్టర్ ఆ చట్టం చేతులకే దొరికిపోయాడు. నేరగాళ్ళని పట్టుకోవాల్సి ఎస్సై తానే నేరగాడిగా మారాడు. డ్రగ్స్‌కి కళ్ళెం వేయాల్సిన ఆ ఎస్సై ఆ మత్తు పదార్థాలే అమ్ముకోవాలని ప్లాన్ చేసి సైబరాబాద్ పోలీసులకి చిక్కాడు.