Teachers Transfers: ఉపాధ్యాయుల బదిలీలకి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో ఉపాధ్యాయులకి హైకోర్టు శుభవార్త చెప్పింది. ఉపాధ్యాయుల బదిలీలకి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తుది తీర్పులకు లోబడి బదిలీలు ఉండాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. టీచర్ల బదిలీలపై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులని హైకోర్టు సవరించింది.

Teachers Transfers: తెలంగాణలో ఉపాధ్యాయులకి హైకోర్టు శుభవార్త చెప్పింది. ఉపాధ్యాయుల బదిలీలకి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తుది తీర్పులకు లోబడి బదిలీలు ఉండాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. టీచర్ల బదిలీలపై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులని హైకోర్టు సవరించింది.
యూనియన్ నేతలకు పాయింట్లు ఉండవు..(Teachers Transfers)
యూనియన్ నేతలకు 10 అదనపు పాయింట్లు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. యూనియన్ నేతలకు పాయింట్లు ఇవ్వకుండానే టీచర్ల బదిలీలు చేయడానికి తెలంగాణ హైకోర్టు అనుమతించింది. అలాగే ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించడానికి హైకోర్టు అంగీకరించింది. భార్యాభర్తలు కలిసి ఉండాలన్నది నిబంధన ఉద్దేశమని హైకోర్టు గుర్తు చేసింది.
ఇవి కూడా చదవండి:
- TDP Chief ChandraBabu Naidu: తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తాము.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
- G-20 Summit: జీ-20 సదస్సుకు ఇండియా ఆతిథ్యం .. ఢిల్లీ స్టార్ హోటళ్లలో దేశాధినేతల బస