Last Updated:

Today Horoscope January 27: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు కీలక విషయాల్లో తొందరపడొద్దు!

Today Horoscope January 27: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు కీలక విషయాల్లో తొందరపడొద్దు!

Horoscope Today in Telugu January 27: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు.

మేషం – ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైన సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. అనుకోని అతిథులను కలిసి కీలక సమాచారం అందుకొంటారు. కాంట్రాక్టులు, లైసెన్సులు లాభిస్తాయి.

వృషభం – ప్రతిబంధ కాలని అధిగమించి పనులను సానుకూలపరుచుకుంటారు. బ్యాంకు రుణాల విషయం లో సాంకేతిక లోపాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.

మిథునం – వ్యాపారపరంగా స్వల్పమైన అభివృద్ధిని సాధించగలుగుతారు. చాలా కాలంగా ఎదుర్కొంటున్నటు వంటి సాంకేతిక ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. పెండింగ్‌లో ఉన్న అప్పులు తీరుతాయి.

కర్కాటకం – వృత్తి ఉద్యోగాలపరంగా స్థిరత్వాన్ని సాధిస్తారు. విభేదాలు తారస్థాయికి చేరుకోకుండా ఆదిలోనే పరిష్కరించుకోండి. వ్యాపారపరంగా స్వల్పమైన అభివృద్ధిని సాధించగలుగుతారు.

సింహం – శుభకార్యాలకు సంబంధించిన చర్చలు పురోగమిస్తాయి. ఊరటను కలిగించే విలువైన సమాచారాన్ని అందుకుంటారు.కీలకమైన వ్యవహారాలలో ఏర్పడిన ప్రతిబంధకాలు తొలగిపోతాయి.

కన్య – వృత్తిలో పురోగతి సాధిస్తారు. ధనానికన్నా వ్యక్తిగత గౌరవానికి అధిక ప్రాముఖ్యతను ఇస్తారు. గతంలో ఒకరికి ఇచ్చిన మాటను నెరవేరుస్తారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించండి.

తుల – ఇతరులకు ఆచరణ సాధ్యం కానటువంటి పనులను కూడా మీరు చేయగలుగుతారు. సొంత నిర్ణయాలకు ప్రాముఖ్యత ఇచ్చి లాభపడతారు. కొంత మానసిక అశాంతి, అలసట ఏర్పడుతుంది.

వృశ్చికం – శత్రువులు మీపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టుతారు. మీకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకోవడానికి గాను అవిశ్రాంతంగా కృషి చేస్తారు. మానసిక సంఘర్షణకు గురవుతారు.

ధనుస్సు – ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా నడుచుకుంటారు. వృత్తి ఉద్యోగాలపరంగా సంతృప్తికరమైన ఫలితాలు. కీలకమని భావించిన అంశాలలో తొందరపాటు చేయకూడదు.

మకరం – మారుతున్న సామాజిక పరిస్థితులు ఆలోచింపచేస్తాయి.పొదుపు పథకాలను పాటించడంలో వైఫల్యం చెందుతారు. మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి.

కుంభం – ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మీరు చేసే పనులు ఇతరులకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు.

మీనం – కొత్త రంగాలలో అనుభవం సాధించడానికి శ్రీకారం చుడతారు. ఉద్యోగాలలో ఎదురైనా చికాకులు తొలగి ఊరట చెందుతారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి.