Home / తెలంగాణ
కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలంటూ కొంతకాలంగా చెప్పులు లేకుండా నడుస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్‌కి ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చిపడింది. మంత్రి సత్యవతి సంకల్ప దీక్షకి భానుడి ప్రతాపం సవాల్‌గా మారింది.
హైదరాబాద్ - సికింద్రాబాద్ జంట నగరాల మధ్య పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఎంఎంటీఎస్ రద్దు నాలుగు రోజుల పాటు ఉంటుందని తెలిపింది.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా తెలంగాణ పర్యటన రద్దు అయింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూలై 15 న అమిత్ షా ఖమ్మంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది.
బ్రిటన్ రాజధాని లండన్ లో దారుణం చోటు చేసుకుంది. విదేశీ విద్య కోసం లండన్ లో ఉంటున్న ఇద్దరు తెలుగు యువతులపై ఓ ఉన్మాది దాడి చేశాడు. ఈ ఘటనలో ఒక యువతి అక్కడికక్కడే మృతి చెందింది.
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్న వేళ తెలంగాణలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో నేటి ఉదయంనుంచి ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి.
ఎనిమిది వేల కోట్ల రూపాయల బ్యాంకు ఫ్రాడ్ కేసులో డక్కన్ క్రానికల్ సంస్థకి చెందిన 14 ఆస్తులని ఈడీ అధికారులు అటాచ్ చేశారు. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరులోని ఆస్తులని ఈడీ అధికారులు సీజ్ చేశారు. కెనరా, ఐడిబిఐ బ్యాంకులను మోసం చేసిన కేసులో ఆరు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
తెలంగాణలో పాగా వేసేందుకు గాను ఏ అవకాశాన్ని వదులుకోరాదని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను తనవైపు తిప్పుకోవడానికి గత కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులపై బీజేపీ దృష్టి సారించింది
యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అన్నం పెట్టే రైతులకు సంకెళ్లు వేశారు. రీజనల్ రింగ్ రోడ్ బాధిత రైతుల చేతులకు బేడీలు, గొలుసులు వేసి కోర్టుకు తీసుకువెళ్లారు. 14 రోజుల రిమాండ్ పూర్తికావడంతో రైతులను నల్గొండ జైలు నుంచి కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు.
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య ఘటన కలకలం సృష్టించింది. పీయూసీ విద్యార్థిని దీపిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
తెలంగాణ సీనియర్ రాజకీయ నాయకుడు, మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఈ లోకాన్ని వీడారు. కొంతకాలంగా అనారోగ్య కారణాలతో హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. ఈరోజు ( జూన్ 13, 2023 ) తెల్లవారుజామున మృతి చెందారని సమాచారం అందుతుంది. దయాకర్ మరణంపై సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు