Last Updated:

RK Selvamani : ఏపీ మంత్రి రోజా భర్త.. సెల్వమణిపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్..

ఏపీ మంత్రి రోజా భర్త సెల్వమణి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగుతోపాటు తమిళంలోనూ పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్, ఫెఫ్సీ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే తాజాగా సెల్వమణిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ

RK Selvamani : ఏపీ మంత్రి రోజా భర్త.. సెల్వమణిపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్..

RK Selvamani : ఏపీ మంత్రి రోజా భర్త సెల్వమణి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగుతోపాటు తమిళంలోనూ పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్, ఫెఫ్సీ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే తాజాగా సెల్వమణిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆయన ఒక టీవి ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అరుణ్ అన్నరసుతో కలిసి సెల్వమణి ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఆ ఇంటర్వ్యూలో  ఆయన మాట్లాడుతూ ఫైనాన్షియర్ ముకుల్ చంద్ వల్ల తీవ్రంగా నష్ట పోయినట్టు చెప్పుకొచ్చారు. కాగా ఆ ఇంటర్వ్యూను చూసిన ముకుల్.. సెల్వమణిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. చెన్నైలోని జార్జ్ టౌన్ కోర్టులో సెల్వమణిపై పరువు నష్టం దావా కేసు వేశాడు. 2016 లో జరిగిన ఈ ఘటనపై కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే కొద్ది సంవత్సరాల క్రితమే ఫైనాన్షియల్ ముకుల్ చంద్ మరణించాడు.. తన తండ్రి మరణించినప్పటికి గగన్ బోత్రా మాత్రం కేసును కొనసాగించారు.

Minister Roja

అయితే కేసు విచారణ సందర్భంగా కోర్టుకు హాజరు కావాల్సిందిగా ఇదివరకే సమన్లు జారీ చేసింది. కోర్టు సమన్లు జారీ తర్వాత కూడా విచారణకు గైర్హాజరయ్యారు మంత్రి రోజా భర్త.. దీంతో ఆగ్రహించిన కోర్టు సెల్వమణిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అలానే తదుపరి విచారణను సెప్టెంబర్ 22 కు వాయిదా వేసింది. కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్ పై మంత్రి రోజా, సెల్వమణి ఏ విధంగా స్పందిస్తారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.