Home / తెలంగాణ
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శిగా నవీన్ మిట్టల్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఓ వైపు మైనర్లకు పబ్బుల్లో ప్రవేశాలు, మరో వైపు నిత్యం ఎక్కడో ఓ చోట జరిగే అసాంఘిక వ్యవహారాలకు హైదరాబాదు పబ్ లు కేరాఫ్ గా మారుతున్నాయి. దీనిపై ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అధికారులకు ప్రభుత్వ పెద్దలు అడ్డు తగులుతూ ఉంటారు. దీంతో పర్యవేక్షణ పోలీసులకు సాధ్యం కాని పనిగా మారింది.
దేశంలో రోజురోజుకి మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్ద తేడాలేకుండా పసికందు నుంచి పండు ముసలివాళ్లను సైతం మృగాళ్లు విడిచిపెట్టడం లేదు. మనిషి అని మర్చిపోయిన కామాంధుల కీచక కార్యకలాపాలకు చిన్న పిల్లలు బలైపోతున్నారు. ఈ క్రమంలోనే తొమ్మిదేళ్ల బాలికపై ఓ కీచకుడు పేట్రేగిపోయాడు. చిన్నపిల్ల అని కూడా చూడకుండా ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన తాజాగా రంగారెడ్డి జిల్లాలో జరిగింది.
టీఎస్ పీఈసెట్ -2022 ఫలితాలు వచ్చేశాయ్. ఈ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆర్ లింబాద్రి, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సీహెచ్ గోపాల్ రెడ్డి కలిసి విడుదల చేశారు. టీఎస్ పీఈసెట్లో 95.93 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది.
పటాన్చెరు నియోజకవర్గం టీఆర్ఎస్లో ముసలం పుట్టింది. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ పై కన్నేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డికి టీఆర్ఎస్ నేత, చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తలనొప్పిగా మారారన్న టాక్ వినిపిస్తోంది.
వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల.మంత్రి కేటీఆర్ ఫై సోషల్ మీడియా వేదికగా హ్యాట్సాఫ్ చిన్నదొరా అంటూ సెటైరికల్ ట్వీట్ చేసారు.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మృతి చెందిన ఘటన ఇబ్రహీంపట్నంలో జరిగిన సంగతి విదితమే. కాగా ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అయితే ఈ ఘటనపై ప్రభుత్వం సీరయస్ అయ్యింది. దీనికి బాధ్యులయిన పలువురు అధికారులపై బదిలీ వేటు వేసింది. మరికొందరిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించింది.
భాగ్యనగరంలో రేపు అనగా సెప్టెంబర్ 25 ఆదివారం నాడు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్టు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నగరంలో గ్యాథరింగ్ సైక్లింగ్ కమ్యూనిటీ మారథాన్ ఉన్న నేఫథ్యంలో ఈ ఆంక్షలు అమలుచేస్తున్నట్టు పేర్కొన్నారు.
వర్షాకాలం ముగింపులో సెప్టెంబర్-అక్టోబర్ మధ్య ప్రతి ఏటా ఈ పండుగ వస్తుంది. ఈ పండుగను తొమ్మిది రోజులు జరుపుకుంటారు. ఈ సంవత్సరం సెప్టెంబరు 25 నుంచి ఈ పండుగ మొదలవ్వనుంది. ప్రతి ఏడాది అమావాస్య నాడు ఈ బతుకమ్మ పండుగ మొదలవుతుంది.
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. సెప్టెంబర్ 25, ఆదివారం నాడు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు హైదరాబాద్ మెట్రో యాజమాన్యం తెలిపింది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగనున్న మూడవ టీ20 క్రికెట్ మ్యాచ్ను సందర్భంగా ఈ ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొనింది.