Home / తెలంగాణ
హైదరాబాద్ ఎంజే మార్కెట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. హైదరాబాద్ పర్యటనలో ఉన్న అస్సోం సీఎం హిమంత్ బిశ్వశర్మ మాట్లాడుతుండగా, టీఆర్ఎస్ నేత నందూ బిలాల్ మైక్ లాగారు. వెంటనే స్పందించిన పోలీసులు అతన్ని అక్కడి నుంచి పంపించారు.
మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ. తాజాగా విడుదలైన 181 అంగన్వాడీ సూపర్వైజర్ గ్రేడ్-1 ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ షురూ అయ్యింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలో జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. సీఎంగా ఉంటూనే జాతీయ రాజకీయాల్లోకి రానున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు వేదిక ఖరారు అయ్యింది.
తెలంగాణాలో ఎన్నికల సమయంలో దగ్గర పడేకొద్ది టిఆర్ఎస్ నేతల్లో జోరు ఊపందుకొంటుంది. కేంద్రం పై పెద్ద పోరాటం చేస్తూ, తెలంగాణ వాదాన్ని వినిపించేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు.
బాలాపూర్ గణేష్ అన్నా, అక్కడి లడ్డు వేలం పాట అన్నా అందరూ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. బాలాపూర్ లడ్డూ చుట్టు సెంటిమెంట్లు ఉన్నాయి. ఈ లడ్డును చేజిక్కించుకుంటే నట్టింట సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్మకం. అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుందనే విశ్వాసం ఉన్నాయి.
మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్దిగా పాల్వాయి స్రవంతిని పార్టీ ప్రకటించింది. దీనితో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడినట్లయింది.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైసిపి నేత లక్ష్మీ పార్వతి దాఖలు చేసిన కేసులో ఆమెకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఒకరి ఆస్తులు తెలుసుకోవడానికి మీరు ఎవరంటూ కేసును ధర్మాసనం కొట్టేసింది.
ఆసియా కప్-2022లో విరాట్ కోహ్లీ సత్తాచాటాడు. ఇండియా ఆఫ్గానిస్తాన్ కు మధ్య గురువారం జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ కొట్టి కొత్త రికార్డ్ సృష్టించారు. దీనికి గానూ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు కోహ్లీని ట్విట్టర్ వేదికగా అభినందించారు.
ట్విట్టర్ లో తెలంగాణకు చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ మొదటి స్థానంలో నిలిచారు. ప్రతి వెయ్యి జనాభాకు ఉన్న ఫాలోవర్ల ప్రాతిపదికన రూపొందించిన జాబితాలో రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారిక ట్విట్టర్ తెలంగాణలోనే మొదటి స్థానంలో నిలిచింది.
గణేష్ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న లడ్డు చాల మహిమగలదని భక్తుల విశ్వాసం. అందుకే ఈ లడ్డు ను దక్కించుకునేందుకు భక్తులు పోటీపడతారు. లక్షలు పెట్టి మరి వేలంపాటలో లడ్డును దక్కించుకుంటారు. అయితే గణేష్ లడ్డు వేలంపాట అంటే అందరికి బాలాపూర్ లడ్డునే గుర్తువస్తుంది.