Home / తెలంగాణ
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 157 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన కేంద్రం తెలంగాణాకు ఒక్కటి కూడా కేటాయించకపోవడం దురదృష్టకరమని మంత్రి హరీష్ రావు ఆరోపించారు .రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభించనున్నట్లు మంత్రి హరీష్ మీడియాతో పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ చివరిరోజు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలను సీఎం కేసిఆర్ తెలియచేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ప్రజలందరికి అభినందనలు తెలిపారు
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసిఆర్ దసరా రోజున జాతీయ పార్టీ ప్రకటన చేస్తున్న క్రమంలో ఆ పార్టీ తీరును కేంద్ర పర్యాటక శాఖామంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు
మునుగోడు నియోజవర్గ ఉప ఎన్నికకు నగారా మోగింది. నవంబర్ 3న ఉపఎన్నికను చేపడుతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది
ట్రాఫిక్స్ రూల్స్‌ను అతిక్రమించేవారికి ఇక నుంచి భారీగా ఫైన్లు పడనున్నాయి. నేటి నుంచి హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్ రూల్స్ రానున్నాయి. అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రోప్ పేరుతో పోలీసులు కొత్త డ్రైవ్ చేపట్టనున్నారు.
పోలీసు ఉద్యోగార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల పోలీసుల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి రాత పరీక్ష నిర్వహించిన సంగతి విదితమే. కాగా పోలీసు ఉద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. కటాఫ్ మార్కులను తగ్గించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.దసరా పండగ రోజున(అక్టోబర్ 5) మధ్యాహ్నం 1.19 గంటలకు కొత్త పార్టీని ప్రకటించనున్నారు.
బతుకమ్మ పండుగ నేటితో ముగియనుంది. ఈ వేడుకల్లోని చివరి రోజు సందర్భంగా హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్టు సిటీ పోలీసులు వెల్లడించారు.
దసరా వేళ ప్రశాంతంగా సరదాగా పండుగ చేసుకుందాం అనుకుంటుంటే ఈ వర్షాలు తెలుగు రాష్ట్రాల ప్రజలను వదలడం లేవు. గత కొద్ది రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వర్షం ధాటికి తడిసి ముద్దవుతున్నాయి. ఈక్రమంలోనే రాష్ట్రంలో మంగళవారం నుంచి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
Bathukamma : తొమ్మిదొవ రోజు సద్దుల బతుకమ్మ