Home / తెలంగాణ
మునుగోడు ఉప ఎన్నిక సమయం దగ్గర పడుతున్న కొద్ది ప్రధాన పార్టీలు ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు వ్యూహ, ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, వి హెచ్ హనుమంతరావు గట్టుప్పలో ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ కు ఓటెయ్యాలంటూ అభ్యర్ధించారు.
బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. వీటికోసం ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని విద్యార్థులను కోరారు. సోమవారం రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్లు బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించారు.
5వేలు లంచం తీసుకొంటూ ఏసీబీ అధికారులకు దామరగద్ద తహశీల్దారు వెంకటేష్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు
ఆడుతూపాడుతూ అప్పటివరకూ కళ్లముందే తిరుగుతున్న చిన్నారులు కొద్ది క్షణాల్లోనే విగతజీవులుగా మారారు. సరదాగా చేపలు పట్టడానికి వెళ్లి నీటికుంటలో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్లో చోటుచేసుకుంది.
రాజ్యసభ సభ్యులు, టీఆర్ఎస్ నేత కే. కేశవరావు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వానికి రాజీనామా చేసారు. ఈ మేరకు లేఖను మీడియా ముందుంచారు. తన సభ్యత్వాన్ని వదిలేస్తున్నట్లు ఇప్పటికే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ కు తెలియచేసివున్నట్లు ఆయన తెలిపారు.
ఏపిలో ఆరోగ్య విశ్వ విద్యాలయానికి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడాన్ని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తప్పు బట్టారు. ప్రపంచ వ్యాప్తంగా పేరున్న గొప్ప వ్యక్తి ఎన్టీఆర్, ఆయన పేరు మార్పును ఎవ్వరూ అంగీకరించరు, నేను ఖండిస్తున్నానంటూ కుండ బద్దలు కొట్టిన్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రమేయంతోనే హుజూరాబాద్ పురపాలక సంఘంలో రెండు కోట్ల మేర అవినీతి చోటుచేసుకొందని నల్గొండ పార్లమెంటు సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు
నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లి, విద్యార్థులతో నేరుగా మాట్లాడనున్నారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.
రాజాసింగ్ కు ప్రాణ హాని ఉందని విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. పిడియాక్ట్ కింద జైల్లో ఉన్న ఎమ్మెల్యేను కలిసేందుకు జైలు అధికారులు ములాఖత్ కు అనుమతించక పోవడాన్ని తప్పుబట్టారు
హైదరాబాద్ మెట్రో రైళ్లు ఆదివారం కిటకిటలాడాయి. ఆదివారం ఒక్క రోజే 3.5 లక్షల మంది మెట్రో ప్రయాణం చేసారు. దీనికి కారణం ఉప్పల్ లో జరిగిన భారత్-ఆసీస్ ల మధ్య మ్యాచ్ జరగడమే కారణం. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ను చూసేందుకు నగరంలోని నలుమూలల నుంచి అభిమానులు తరలివచ్చారు.