TS PECET-2022 Results: పీఈసెట్ ఫలితాలొచ్చేశాయ్.. అబ్బాయిలదే హవా
టీఎస్ పీఈసెట్ -2022 ఫలితాలు వచ్చేశాయ్. ఈ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆర్ లింబాద్రి, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సీహెచ్ గోపాల్ రెడ్డి కలిసి విడుదల చేశారు. టీఎస్ పీఈసెట్‌లో 95.93 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది.
TS PECET-2022 Results: టీఎస్ పీఈసెట్ -2022 ఫలితాలు వచ్చేశాయ్. ఈ ఫలితాలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆర్ లింబాద్రి, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సీహెచ్ గోపాల్ రెడ్డి కలిసి విడుదల చేశారు. టీఎస్ పీఈసెట్‌లో 95.93 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది. అండర్ గ్రాడ్యుయేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(యూజీడీపీఈడీ), బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(బీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశానికి నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా ఫిజికల్ ఈవెంట్స్ పరీక్షలు జరిగిన విషయం విదితమే.
కాగా బీపీఈడీ కోర్సుల్లో పురుష అభ్యర్థులు 98.33 శాతం, అమ్మాయిలు 91.40 శాతం ఉత్తీర్ణత సాధించారు. యూజీడీపీఈడీ కోర్సుల్లో అబ్బాయిలు 97.04 శాతం, అమ్మాయిలు 95.14 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది.
రాష్ట్ర వ్యాప్తంగా 6 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలకు 3,659 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా, 2,360 మంది హాజరైనట్లు అధికారులు పేర్కొన్నారు.
కాగా ఈ పరీక్షలో మొత్తం 2,264 మంది ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు.
ఇదీ చదవండి: Russian Bat Virus Khosta-2: కరోనా కంటే డేంజర్… మానవాళికి మరో వైరస్ ముప్పు..!