IND vs AUS T20 Match: జింఖానా గ్రౌండ్ లో గాయపడ్డవారికి ఉచిత మ్యాచ్ వీక్షణ
ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7గంటలకు జరగనున్న భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ ను వీక్షించేందుకు మంత్రి శ్రీనివాస గౌడ్ ఉచిత ఏర్పాట్లు చేశారు. అయితే ఈ అవకాశం టిక్కెట్ల కోసం జింఖానా గ్రౌండ్ లో చోటుచేసుకొన్న తొక్కిసలాటలో గాయపడ్డ క్రీడాభిమానులకు మాత్రమే.
Uppal Stadium: ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7గంటలకు జరగనున్న భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ ను వీక్షించేందుకు మంత్రి శ్రీనివాస గౌడ్ ఉచిత ఏర్పాట్లు చేశారు. అయితే ఈ అవకాశం టిక్కెట్ల కోసం జింఖానా గ్రౌండ్ లో చోటుచేసుకొన్న తొక్కిసలాటలో గాయపడ్డ క్రీడాభిమానులకు మాత్రమే. ఈ మేరకు మంత్రే స్వయంగా వారికి ఉచిత పాస్ లు అందచేసి వారిని స్టేడియం వద్దకు తీసుకొచ్చారు. బాక్స్ టిక్కెట్లు దక్కడంతో గాయపడిన క్రీడాభిమానుల్లో సంతోషం వేసింది.
కానిస్టేబుల్ నవీనను కూడా మంత్రి అభినందించారు. విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలకు తెగించి ఓ మహిళ ప్రాణాలు కాపాడడంతో ఆమెకు ప్రమోషన్ తో పాటు ఇంక్రిమెంట్ కూడా ఇవ్వాలని డీజీపికి లెటరు వ్రాసిన్నట్లు మంత్రి పేర్కొన్నారు.
మొత్తం మీద టీ20 మ్యాచ్ పై హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ చేస్తున్న టిక్కెట్ల నిర్వహణ పై దృష్టి పెట్టలేని రాష్ట్ర ప్రభుత్వం, తొక్కిసలాట అనంతరం మాత్రం ఘటనను తన ఖాతాలో వేసుకొనేందుకు శత విధాల ప్రయత్నించింది. ఇలా గాయపడిన వారికి ఉచితం పేరుతో అక్కున చేర్చుకొంటే, భవిష్యత్ తమ ప్రాణాలకు ఏదైనా జరిగితే ప్రభుత్వం ఉందిలే అన్న భావనతో క్రీడాభిమానులు జాగ్రత్తల పై పెద్దగా ఆలోచించించరని నేతలు తెలుసుకోవాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: పేదల పక్షపాతి సీఎం జగన్