Home / తెలంగాణ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.దసరా పండగ రోజున(అక్టోబర్ 5) మధ్యాహ్నం 1.19 గంటలకు కొత్త పార్టీని ప్రకటించనున్నారు.
బతుకమ్మ పండుగ నేటితో ముగియనుంది. ఈ వేడుకల్లోని చివరి రోజు సందర్భంగా హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్టు సిటీ పోలీసులు వెల్లడించారు.
దసరా వేళ ప్రశాంతంగా సరదాగా పండుగ చేసుకుందాం అనుకుంటుంటే ఈ వర్షాలు తెలుగు రాష్ట్రాల ప్రజలను వదలడం లేవు. గత కొద్ది రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వర్షం ధాటికి తడిసి ముద్దవుతున్నాయి. ఈక్రమంలోనే రాష్ట్రంలో మంగళవారం నుంచి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
Bathukamma : తొమ్మిదొవ రోజు సద్దుల బతుకమ్మ
అక్టోబర్ 2 మహాత్మగాంధీ జయంతిని పురస్కరించుకొని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 'ఓకల్ ఫర్ లోకల్' పేరుతో తలపెట్టిన ప్రధానమంత్రి విధానాన్ని పాటించారు
మునుగోడు ఉపఎన్నికల నేపధ్యంలో భాజపా జాతీయ కార్యదర్శి, ఆ పార్టీ తెలంగాణ ఇన్ చార్జ్ సునీల్ బన్సల్ హైదరాబాదుకు చేరుకొన్నారు. ఆ పార్టీ నేతలతో సమావేశమైనారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో బన్సల్ పలు అంశాలను కీలక నేతల ముందుంచారు
తెలంగాణ మంత్రి హరీష్ రావు సిద్దిపేట నేతన్నలను ట్విట్టర్ వేదికగా అభినందించారు. కళా నైపుణ్యానికి వన్నె తెచ్చిన నేతన్నలతోనే గొల్లభామ చీరలకు యునెస్కో గుర్తింపు రావడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు
ఈత సరదా ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండల తాడిపర్తి గ్రామంలో విషాదం నెలకొంది. ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మరణించారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీకి పెను ప్రమాదం తప్పింది. సజ్జనార్ ప్రయాణిస్తున్న కారును ఒక్కసారిగా ఆటో ఢీకొట్టింది. దానితో సజ్జనార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది.
హైదరాబాద్‌లో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలే టార్గెట్‌గా పేలుళ్లకు కుట్ర పన్నిన జాహిద్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు ఉగ్రవాద గ్రూపులతో జాహిద్‌కు లింకులు వున్నట్లుగా సమాచారం.