Home / తెలంగాణ
కేంద్రమంత్రులు తెలంగాణకు వచ్చి కేసీఆర్ ను తిడతారు. మరలా ఢిల్లీ వెళ్లి ప్రభుత్వ పధకాలు బాగున్నాయిని అవార్డులు ఇస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు.
నేడు సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి వరంగల్‌కు ముఖ్యమంత్రి బయల్దేరారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ టు వరంగల్ వెళ్లే రోడ్డు మార్గంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను అమలులో ఉంచారు.
రాహుల్ గాంధీ సారధ్యంలో సాగుతున్న కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర కేవలం ఎన్నికల కోసమే కాదని, దేశ ప్రయోజనాలు, ప్రజాస్వామ్య పరిరక్షణకు చేస్తున్న యాత్రంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్రకు రెడీ అయ్యారు. నాలుగు పాదయాత్రలకు భిన్నంగా ఈసారి, నిత్యం రెండు వర్గాల మధ్య అలర్లు జరిగే ప్రాంతం నుంచి యాత్ర ప్రారంభించడం ఉత్కంఠ రేపుతోంది.
నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సమన్లు జారీ చేసింది. పార్టీకి, అనుబంధ సంస్ధలకు విరాళాలు ఇచ్చిన వారికి నోటీసులు జారీ చేసిన్నట్లు సమాచారం.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర అక్టోబర్ 15 నుండి ప్రారంభం కానుంది. ఐదో విడతలో భైంసా నుండి కరీంనగర్ వరకు పాదయాత్ర చేయనున్నారు బండి సంజయ్.
ఇంటగెలిచి రచ్చ గెలవమన్న సామెత ఉంది. దీనిని కేసీఆర్ నిజం చేయడానికి నిశ్చయించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఆయన రెండు సార్లు సీఎం అయ్యారు. అంటే ఇంట గెలిచారు. దీనితో గులాబీ సారు ఇక ఢిల్లీ పై దృష్టి సారించారు.
నేడు సీఎం కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు.శుక్రవారం రోజు కేసీఆర్ దంపతులు లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.అంతేకాకుండా సీఎం కేసీఆర్ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం బంగారాన్ని కానుకగా ఇవ్వనున్నారని తెలిసిన సమాచరం.సీఎం కేసీఆర్ పర్యటనలో భాగంగా అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది.
పొరుగు రాష్ట్రాలు లేవనెత్తుతున్న అభ్యంతరాలపై పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు తెలంగాణ, ఒడిస్సా, ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేకంగా సమావేశమైంది. పోలవరం నిర్మాణంతో ఎవ్వరికీ నష్టం రాదని కేంద్రం స్పష్టం చేసింది.
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ గా సునీల్ బన్సల్ గత ఆగస్ట్ లో నియామకమైనారు. ఈ నేపధ్యంలో ఆయన అక్టోబర్ 1న హైదరాబాదుకు రానున్నారు.