Last Updated:

Bathukamma : తొమ్మిదొవ రోజు సద్దుల బతుకమ్మ

Bathukamma : తొమ్మిదొవ రోజు సద్దుల బతుకమ్మ

Bathukamma : తొమ్మిదొవ రోజు సద్దుల బతుకమ్మ

Bathukamma Day 9  :  తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీక బతుకమ్మ పండుగ. తొమ్మిది రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది. వర్షాకాలం ముగింపులో సెప్టెంబర్-అక్టోబర్ మధ్య ప్రతి ఏటా ఈ పండుగ వస్తుంది. ఈ సంవత్సరం సెప్టెంబరు 25 నుంచి ఈ పండుగ మొదలయ్యింది. ప్రతి ఏడాది అమావాస్య నాడు ఈ బతుకమ్మ పండుగ మొదలవుతుంది. అక్టోబర్ 3 వరకు ఈ బతుకమ్మ పండుగ జరుపుకోనున్నారు. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ (బతుకమ్మ) తో ఈ పండుగ ముగుస్తుంది. ఈ పండుగ ముఖ్యంగా బతుకమ్మను పూలతో అలంకరించి, ప్రసాదాలతో బతుకమ్మను పూజిస్తారు. తంగేడు పూలు, గునుగు పూలు, గుమ్మడి పూలు, గోరంట్ల పూలు, పేర్చుకుంటూ, పసుపుతో గౌరమ్మను చేసి బతుకమ్మను అలంకరిస్తారు. ఈ పండుగను పల్లెల్లో బాగా జరుపుకుంటారు.

నేడు 03 అక్టోబర్  2022  ” సద్దుల బతుకమ్మ “

తొమ్మిదవ రోజు   ” సద్దుల బతుకమ్మ ” పండగను జరుపుకుంటారు. ఈ రోజు అన్ని పూలతో బతుకమ్మను పేరుస్తారు. ఆట,పాటలతో  ” సద్దుల బతుకమ్మ ” పండుగను  జరుపుకుంటారు. ఈ రోజు అమ్మ వారికి 5 రకాల నైవేద్యాలు పెడతారు.  

ఇవి కూడా చదవండి: