Weather Update: ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. మరో మూడు రోజుల పాటు జాగ్రత్త..!
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో కూరుకుపోయి ఉన్నాయి. కాగా రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Weather Update: ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో కూరుకుపోయి ఉన్నాయి. కాగా రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశముందని సూచించింది. పలు చోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న చెప్పారు.
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్ప పీడనం కాస్త రాగల 24 గంటల్లో వాయుగుండంగా బలపడి దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలకు దగ్గరలోని వాయవ్య దిశగా ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరానికి చేరుకొనే అవకాశం ఉందని వివరించారు. దీని ప్రభావంతో తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని హెచ్చరించారు.
ఇక ఏపీలోని విశాఖ, గోదావరి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యింది. రోడ్లు ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కాగా మరో మూడురోజులు కూడా వర్షాలు పడతాయనడంతో ప్రజల కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: కాలువలో కొట్టుకుపోయిన కారు… ఇద్దరు నీటమునిగి..!