Kishan Reddy: ప్రగతి భవనా..? ఫాం హౌసా..? చర్చకు ఎక్కడికి రమ్మంటారు : కిషన్ రెడ్డి
దేశ ఆర్థిక పరిస్థితి పై ఏమాత్రం అవగాహన లేకుండా తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు.
Kishan Reddy: దేశ ఆర్థిక పరిస్థితి పై ఏమాత్రం అవగాహన లేకుండా తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. దేశాన్ని అవమానించేలా కేసీఆర్ మాట్లాడుతున్నారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలతో పోల్చారని .. దీనిపై కేసీఆర్ తో చర్చకు సిద్ధమని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు.
మీరు ఎక్కడ చర్చకు సిద్దమో అక్కడికి రావడానికి రెడీ అన్నారు. గన్ పార్క్ కు వస్తారా?, ప్రెస్ క్లబ్ లోపెట్టుకుందామా?, ఫార్మ్ హౌస్ లోనా.. ప్రగతి భవన్ లోనా? చర్చకు ఎక్కడకు వస్తారని ప్రశ్నించారు. చర్చలో కల్వకుంట్ల కుటుంబం భాష కాకుండా తెలంగాణ భాష మాత్రమే మాట్లాడలన్నారు.
బీజేపీ తిట్టడానికే అసెంబ్లీ(Kishan Reddy)
అసెంబ్లీ సమావేశాలను దుర్వినియోగం చేశారని కిషన్ రెడ్డి విమర్శించారు. దేశ ఆర్థిక స్థితి గురించి మాట్లాడిన ఆయన .. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై ఎందుకు మాట్లాడలేదన్నారు. కేంద్రాన్ని విమర్శించేందుకే అసంబ్లీ సమావేశాలను వాడుకున్నారు తప్ప బడ్జెట్ పై ఒక్కనిమిషం కూడా మాట్లాడలేదని విమర్శించారు.
ఈ బడ్జెట్ సమావేశాల్లో బీజేపీ పై బురద జల్లి.. కాంగ్రెస్ ను పొగిడారన్నారు. ఏ ఎండకు ఆ గొడుకు పట్టడంలో కేసీఆర్ సిద్ధహస్తుడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిన తిరుమలరాముని పిట్ట కథ దేశంలో ఒక్క కేసీఆర్ కు మాత్రమే వర్తిస్తుందన్నారు.
6 నెలలు ఆగండి
కేసీఆర్ రాజీనామా చేస్తానని గతంలో ఎన్నోసార్లు చెప్పారని.. ఇంకో ఆరు నెలలు ఆగితే ఆయన రాజీనామా చేసే పరిస్థితి వస్తుందన్నారు. రాజీనామా లెటర్ జేబులో పెట్టుకుని తిరుగుతానని కేసీఆర్ చెబుతున్నాడని.. వచ్చే ఎన్నికల తర్వాత రాజ్ భవన్ రాజీనామా లేఖ ఇవ్వడం తప్పదని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. మన దేశ ఆర్థిక పరిస్థితి గురించి ఐఎంఎఫ్ ఏం చెప్పిందో గూగుల్ లో చూడొచ్చన్నారు.
తెలంగాణ రాష్ట్ర అప్పులను కేసీఆర్ 5 లక్షల కోట్లకు చేర్చారన్నారు. అప్పులు చేసి కమిషన్లు కొట్టే ప్రభుత్వం తమది కాదాన్నరు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగోతందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.కల్వకుంట్ల కుటుంబ మంత్రులు నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.