Last Updated:

Munugode: భాజపా ర్యాలీ, తెరాస డీజే.. ఇంకేముంది అంతా రచ్చరచ్చే..!

మునుగోడు ఉపఎన్నికల వేళ రోజురోజుకు రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ప్రధాన పార్టీల మధ్య వైరం రోజురోజుకు అగ్గిమీద గుగ్గిళంలా తయారవుతోంది. కాగా తాజాగా బైపోల్ ప్రచారంలో భాగంగా నాంపల్లి మండలంలోని పసునూరులో బీజేపీ, టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

Munugode: భాజపా ర్యాలీ, తెరాస డీజే.. ఇంకేముంది అంతా రచ్చరచ్చే..!

Munugode: తెలంగాణ ప్రజలే కాకుండా భారత ప్రజల దృష్టి అంతా ఇప్పుడు మునుగోడువైపే ఉంది. ఉపఎన్నికల వేళ రోజురోజుకు రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ప్రధాన పార్టీల మధ్య వైరం రోజురోజుకు అగ్గిమీద గుగ్గిళంలా తయారవుతోంది. కాగా తాజాగా బైపోల్ ప్రచారంలో భాగంగా నాంపల్లి మండలంలోని పసునూరులో బీజేపీ, టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

పసునూరు గ్రామంలో ప్రచారం పర్వంలో భాగంగా బీజేపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహిస్తున్నారు. అయితే ఇదే సమయంలో తెరాస పార్టీ నేతలు డీజే పెట్టారు. దీనితో ప్రచారం కాస్త రచ్చకెక్కింది. టీఆర్ఎస్ కవ్వింపులకు పాల్పడిందని భాజపా ఆరోపించింది. ఈ నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది వారిని నిలువరించేందుకు వచ్చిన పోలీసులను సైతం వారు తోసివేశారు. ఇదిలా ఉండగా అటు టీఆర్ఎస్ కు డిజే పర్మీషన్ ఎవరు ఇచ్చారని పోలీసులను బీజేపీ కార్యకర్తలు ప్రశ్నించారు. కాగా పసునూరు గ్రామానికి  మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెరాస ఇంచార్జ్గా ఉన్నారు.

మరోవైపు మునుగోడు ఉపఎన్నిక ప్రచారం ఆఖరి ఘట్టానికి చేరుకుంది. రేపు అనగా నవంబర్ 1 సాయంత్రం 3 గంటలకు ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు, అభ్యర్థులు హోరాహోరీగా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇవాళ, రేపు సాధ్యమైనంత వరకు నేరుగా ఓటర్లను తమవైపు ఆకర్షించేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. ఇంకోవైపు పార్టీల ప్రలోభాలపై ఈసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది.

ఇదీ చదవండి: మునుగోడు ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్.. రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసులు

ఇవి కూడా చదవండి: