Last Updated:

BJP Election Committees: తెలంగాణ ఎన్నికల కమిటీలను ప్రకటించిన బీజేపీ

తెలంగాణ ఎన్నికల కమిటీలను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా వివేక్ వెంకటస్వామి, కన్వీనర్‌గా మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కన్వీనర్‌గా కొండా విశ్వేశ్వర్ రెడ్డిని నియమించారు. పబ్లిక్ మీటింగ్స్ ఇంఛార్జిగా బండి సంజయ్‌ని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపిక చేశారు.

BJP Election Committees: తెలంగాణ ఎన్నికల కమిటీలను ప్రకటించిన బీజేపీ

BJP Election Committees:తెలంగాణ ఎన్నికల కమిటీలను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా వివేక్ వెంకటస్వామి, కన్వీనర్‌గా మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కన్వీనర్‌గా కొండా విశ్వేశ్వర్ రెడ్డిని నియమించారు. పబ్లిక్ మీటింగ్స్ ఇంఛార్జిగా బండి సంజయ్‌ని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపిక చేశారు. ఆందోళన కమిటీ చైర్మన్‌గా విజయ శాంతి, ఛార్జ్ షీట్ కమిటీ చైర్మన్‌గా మురళీధర్ రావుని నియమించారు.

తెలంగాణ ను 6 జోన్లుగా చేసి..(BJP Election Committees)

మరోపక్క రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంఛార్జిలు సమావేశం అయ్యారు. బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బి ఎల్ సంతోష్ , పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ హాజరయ్యారు. తెలంగాణ ను 6 జోన్లుగా చేసిన బీజేపీ ఒక్కో జోన్‌కు ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన నేతలకు జిల్లా ఇంఛార్జిలుగా బాధ్యతలు ఇచ్చారు. కేంద్ర మంత్రులకు కూడా జిల్లా బాధ్యతలు అప్పగించానున్నారు.