Osmania University: ఉస్మానియా యూనివర్శిటీలో పోలీసుల ఓవరాక్షన్
హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళనకు దిగిన డీఎస్సీ అభ్యర్థులపై దురుసుగా ప్రవర్తించారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయబోతున్న బీఆర్ఎస్వీ నేతలపై లాఠీచార్జ్ చేశారు.
Osmania University: హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళనకు దిగిన డీఎస్సీ అభ్యర్థులపై దురుసుగా ప్రవర్తించారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయబోతున్న బీఆర్ఎస్వీ నేతలపై లాఠీచార్జ్ చేశారు. బీఆర్ఎస్వీ నేతల కడుపు, వీపుపై దాడి చేయడమే కాకుండా.. కాళ్లతో తంతూ ఈడ్చుకెళ్లారు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపైనా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఓ రిపోర్టర్‌ను గల్లా పట్టి ఈడ్చుకెళ్లారు. ప్రొటెస్ట్ వీడియోను డిలీట్ చేయాలని బెదిరించారు.
విద్యార్ది సంఘం నేతల అరెస్ట్..(Osmania University)
ఓయూ క్యాంపస్‌లోని ఆర్ట్స్ కాలేజీ వద్ద నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్వీ నాయకుడిపై పలువురు నగర పోలీసు సిబ్బంది దాడి చేస్తున్న మరో వీడియో కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కనిపించింది. తమ డిమాండ్లపై నిరుద్యోగ యువతకు మద్దతు తెలిపినందుకు బుధవారం ఉదయం పోలీసులు పలువురు బీఆర్ఎస్వీ నాయకులను ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఎన్ఆర్ఎస్ హాస్టల్ నుంచి అదుపులోకి తీసుకున్నారు.రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ, గ్రూప్-2, 3 పోస్టుల పెంపు కోసం నిరుద్యోగ యువత తరపున మాట్లాడినందుకు బీఆర్ఎస్వీ నేతలను అదుపులోకి తీసుకున్నారని బీఆర్ఎస్వీ నాయకుడు జంగయ్య అన్నారు. డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ ఆందోళనకారులను నియంత్రించేందుకు ఓయూ క్యాంపస్‌లో ప్రత్యేకించి ఆర్ట్స్ కళాశాల వద్ద భారీగా పోలీసులు మోహరించారు.ఇదిలావుండగా, రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ల నియామకంలో జాప్యంపై మౌనంగా ఉన్నారంటూ ప్రొఫెసర్ కోదండరామ్ ఇంటిని ముట్టడించేందుకు పిలుపునిచ్చిన పలువురు తెలంగాణ విద్యార్థి పరిషత్ (టిఎస్పి) నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.