Home / ప్రాంతీయం
మునుగోడు ఉప ఎన్నికల్లో గందరగోళానికి దారితీసిన నూతన ఓటర్ల వ్యవహారంలో హైకోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. నేటి విచారణలో ఎన్నికల సంఘం న్యాయవాది కూడా పాల్గొన్నారు.
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలతో పలు చెరువులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. వరద ప్రభావంతో పలు ప్రాంతాలకు ముప్పు ఏర్పడింది. ఈ క్రమంలో అనంతపురం అధికారులు నగరానికి వరద ముప్పు పొంచి ఉంది అంటూ ప్రజలను మెసేజ్ రూపంలో హెచ్చరికలు చేశారు.
చట్టాలు, మార్గదర్శకాలు, పద్ధతులను అమలు చేయడంలో ఏపీ ప్రభుత్వం గాల్లోకి వదిలేసింది. ఈ నేపథ్యంలో న్యాయస్ధానాల నుండి పలుమార్లు ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగులుతోంది. ఇలాంటి పరిణామాలు ఏపీ ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయాయి.
తెలంగాణ రెవెన్యూ శాఖలో గత 80 రోజులుగా సమ్మె చేస్తున్న విఆర్ఏల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకరించడంతో నేటినుంచి విధుల్లో చేరాలని విఆర్ఏలు నిర్ణయించారు.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసారు. అదీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆయన తనయుడు తారక రామారావు (కేటీఆర్)ను సంభోదిస్తూ వాళ్ళ పాలనను తాలిబన్ పాలనతో పోలుస్తూ వర్మ వరుస ట్వీట్లు చేసారు.
తండ్రిని చంపిన చంద్రబాబుతో షోలు చేస్తున్న బాలకృష్ణకు సిగ్గుందా? అని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. నాని బుధవారం గుడివాడ ఐదో వార్డు శ్రీరామపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఏపీ సీఎం జగన్ బాబయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అఫ్రూవర్ మారిన డ్రైవర్ దస్తగిరి మరో మారు కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పులివెందుల నుండి కడపకు వచ్చిన దస్తగిరి తొలుత సీబీఐ అధికారులను కలసి అనంతరం ఎస్పీ కార్యాలయంలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
మునుగోడు ఉప ఎన్నిక బరిలో తెలంగాణ టీడీపీ దిగనుంది. ఆ పార్టీ అభ్యర్ధిగా జక్కలి ఐలయ్య యాదవ్ పోటీ పోటీ చేయనున్నారు. రేపటిదినం టీడీపీ అధిష్టానం అధికారికంగా ప్రకటన చేయనుంది.
ప్రాజెక్టులపై అవగాహన లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారని, పులివెందుల, కుప్పం ప్రాంతాలకు నీరెవరిచ్చారు? చెప్పండి సీఎం అంటూ మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఉమా ఏపి ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
మునుగోడు, తెలంగాణలో ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడి నోట విన్నా ఇదే పేరు. ఎందుకంటే అక్కడ వచ్చే నెల మూడో తేదీన ఉప ఎన్నిక జరగనుంది.