Last Updated:

VRA Protest: తెలంగాణలో నేటి నుంచి విధుల్లోకి విఆర్ఏలు

తెలంగాణ రెవెన్యూ శాఖలో గత 80 రోజులుగా సమ్మె చేస్తున్న విఆర్ఏల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకరించడంతో నేటినుంచి విధుల్లో చేరాలని విఆర్ఏలు నిర్ణయించారు.

VRA Protest: తెలంగాణలో నేటి నుంచి విధుల్లోకి విఆర్ఏలు

Hyderabad: తెలంగాణ రెవెన్యూ శాఖలో గత 80 రోజులుగా సమ్మె చేస్తున్న విఆర్ఏల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకరించడంతో నేటినుంచి విధుల్లో చేరాలని విఆర్ఏలు నిర్ణయించారు. ప్రభుత్వం, ట్రెసా ప్రతినిధులు, వీఆర్ఏ జేఏసీ నాయకుల మధ్య బుధవారం సాయంత్రం చర్చలు జరిగాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆయన ఛాంబర్‌లో ట్రెసా నాయకులు, విఆర్ఏ జేఏసీ ప్రతినిధులు, సీఐటీయూ నాయకులు చర్చించారు.

ట్రెసా, వీఆర్ఏ జేఏసీ లేవనేత్తిన ముఖ్యమైన అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సానుకూలంగా స్పందించినట్టు వీఆర్‌ఏ, ట్రెసా ప్రతినిధులు తెలిపారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన వీఆర్ఏల పే స్కేల్, అర్హులైన వారికి పదోన్నతులు, వయోపరిమితి మీరిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు, వీఆర్ఏలను రెవెన్యూ శాఖలోనే కొనసాగించడం, సమ్మె కాలానికి వేతనం, సమ్మె కాలంలో చనిపోయిన వీఆర్ఏ కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా వంటి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారన్నారు.

ముఖ్యమంత్రితో చర్చించి వచ్చే నెల 7లోపు మరోసారి పిలిచి మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపడతామని సీఎస్‌ చెప్పినట్టు వారు తెలిపారు. అనంతరం ఆర్ఏ జేఏసీ నాయకులు ట్రెసా ప్రతినిధుల సమక్షంలో సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. గురువారం నుంచి వీఆర్ఏలంతా విధుల్లో చేరతున్నట్టు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి: