Last Updated:

TS High Court: మునుగోడు ఓటర్ల జాబితా.. ప్రకటనను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు

మునుగోడు ఉప ఎన్నికల్లో గందరగోళానికి దారితీసిన నూతన ఓటర్ల వ్యవహారంలో హైకోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. నేటి విచారణలో ఎన్నికల సంఘం న్యాయవాది కూడా పాల్గొన్నారు.

TS High Court: మునుగోడు ఓటర్ల జాబితా.. ప్రకటనను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు

Hyderabad: మునుగోడు ఉప ఎన్నికల్లో గందరగోళానికి దారితీసిన నూతన ఓటర్ల వ్యవహారంలో హైకోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. నేటి విచారణలో ఎన్నికల సంఘం న్యాయవాది కూడా పాల్గొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా ఓటర్ల నమోదు ప్రక్రియ సాగింధని, ఫారం 6 ద్వారా కొత్తగా 25వేల ఓట్లు నమోదు చేసుకొన్నారని పిటిషన్ తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారు అయిందని, నవంబర్ 3న ఎన్నికలు జరగనున్నట్లు న్యాయవాది ధర్మాసనంకు వివరించారు. భారీగా ఓటర్లు నమోదు అక్రమంగా జరిగిందని న్యాయవాది పేర్కొన్నారు.

ఎన్నికల సంఘం తరపున న్యాయవాది కూడా కోర్టులో వాదనలు వినిపించారు. ఓటర్లు నమోదు ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని అన్నారు. ఏటా కొత్త ఓటర్లు నమోదు చేసుకొంటుంటారని తెలిపారు. 2021 జనవరిలో మునుగోడు నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య రెండు లక్షల 22వేల ఉన్నట్లు తెలిపారు. ఆ సంఖ్య ప్రస్తుతం 2లక్షల 38వేలుకు చేరుకొందన్నారు. తుది ఓటర్ల లిస్ట్ ఇంకా ఎన్నికల కమీషన్ ప్రకటించలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్ధానం, ఉప ఎన్నికల సందర్భంగా నమోదైన ఓటర్ల జాబితా నివేదికను సమర్పించాలని ఎన్నికల సంఘానికి ఆదేశిస్తూ, తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

అధికార పార్టీ తెరాస శ్రేణులు, అధిక సంఖ్యలో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియలో అవకతవకలకు పాల్పొడ్డారని, ఇది నిబంధనలకు వ్యతిరేకంగా పేర్కొంటూ భాజపా శ్రేణులు కోర్టు మెట్లు ఎక్కివున్నారు. రేపటిదినం ఎన్నికల కమీషన్ తుది ఓటర్ల లిస్ట్ ను ప్రకటించనున్న నేపధ్యంలో హైకోర్టు తన విచారణను రేపటికి వాయిదా వేసింది. దీంతో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్ధులకు కొత్త ఓటర్ల నమోదు వ్యవహారం మరింత హీటెక్కించిన్నట్లైయింది.

ఇది కూడా చదవండి: మునుగోడు ఓటర్ల నమోదు పై భాజపా పిటిషన్

ఇవి కూడా చదవండి: