Home / ప్రాంతీయం
ఏపీ సీఎం వైఎస్ జగన్ "జగనన్న ఆణిముత్యాలు" కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్యంలోని వివిధ కేటగిరీ విద్యాసంస్థల్లో చదువుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో పదో తరగతి, ఇంటర్లో విద్యార్థులను ఎంపిక చేసింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఈ మేరకు నేడు కూడా పవన్ పర్యటించనున్నారు. తాజాగా పార్టీ అధిష్టానం పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ని ప్రకటించింది. షెడ్యూల్ లో భాగంగా ముందుగా మధ్యాహ్నం 12 గం. లకు కాకినాడకు చెందిన ముస్లిం ప్రతినిధులతో సమావేశం కానున్నారు.
తాను కమిట్మెంట్తో పార్టీ స్టార్ట్ చేశానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రస్తుతం ఉన్న సీఎంలా అద్భుతాలు చేస్తానని చెప్పనని.. మత్స్యకారుల ప్రతీ సమస్యను నిజాయితీతో పరిష్కరిస్తానని పవన్ అన్నారు. కాకినాడ జగన్నాథపురం, ఏటిమొగలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించారు.
అదిలాబాద్ యం.పి సోయం బాపు రావు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. పార్టీ నేతలతో తన నివాసం లో ఏర్పాటు చేసిన సమావేశంలో తాను ఎంపీ ల్యాడ్స్ నిధులు సొంత అవసరాలకు వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు.
జనగామ జిల్లా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ సారి కూడా కుమార్తె తుల్జా భవాని రెడ్డి కారణంగా ముత్తిరెడ్డి వివాదంలో ఇరుక్కోవడం విశేషం. నా సంతకాన్ని ఫోర్జరీ చేశావంటూ తుల్జా భవాని రెడ్డి తన తండ్రి, ఎమ్మెల్యే అయిన ముత్తిరెడ్డిని నలుగురిలో నిలదీసింది.
శ్రీవాణి ట్రస్టు నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఈ అంశంపై రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం టీటీడీపై దుష్ప్రచారం చేసేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తీర్మానించింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా సీఎం చేయమని.. కోరడం.. వైసీపీ ఎమ్మెల్యే లపై పవన్ కళ్యాణ్ విరుచుకుపడడం.. సర్వత్రా ఆసక్తి కలిగిస్తుంది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీవ్రస్థాయిలో
మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కౌంటర్ ఇచ్చారు. పెద్ద పెద్ద నాయకులమని చెప్పి మీసాలు తిప్పిన వాళ్లు కూడా పరకాలలో పోటీ చేయడానికి భయపడుతున్నారన్న కేటీఆర్ కామెంట్స్‌కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. శ్రీకృష్ణదేవరాయల వంశానికి చెందిన వాణ్ని.. మీసాలు పెంచి, మెలేయడం తమకు రాజుల కాలం నుంచి వచ్చిందని కొండా మురళి అన్నారు
ఒళ్లు పొగరెక్కి వున్నావు..మీ తాతకు డీటీ నాయక్ చేసినట్లు నీకు ఈ భీమ్లా నాయక్ చేస్తాడంటూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపు రెడ్డి చంద్రశేఖర రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. వారాహి యాత్రలో భాగంగా కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ లో ఆదివారం రాత్రి ఆయన బహిరంగ సభలో మాట్లాడారు.
ఏపీ రాజకీయాల్లోకి తాజాగా కొత్త పార్టీ రాబోతుంది. మాజీ ఐఏఎస్ అధికారి వి.జి.ఆర్ నారగోని, పుంగనూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అన్నా రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ పార్టీ ఏర్పాటు కానుంది. కాగా ఈ మేరకు ఈరోజు విజయవాడలో పార్టీ ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.