OLA First Electric Bike: ఇదే! ఓలా ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్.. లుక్స్, రేంజ్ అదిరిపోయింది కదూ..!
OLA First Electric Bike: ఓలా ఇటీవలే, Ola Electric తన కొత్త శ్రేణి S1 స్కూటర్లను విడుదల చేసింది. వీటికి భారీ డిమాండ్ ఏర్పడటంతో కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను ఆవిష్కరించబోతోంది. కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ బైక్ “రోడ్‌స్టర్ ఎక్స్”ని ఈ నెల 5న విడుదల చేయనుంది. ఇటీవల ఈ బైక్ టెస్టింగ్ సమయంలో కూడా కనిపించింది. ఇది మాత్రమే కాదు, ఈ బైక్‌కు సంబంధించిన కొంత సమాచారం కూడా వెలుగులోకి వచ్చింది.
రోడ్‌స్టర్‌లో 2.5 కిలోవాట్, 3.5 కిలోవాట్, 4.5కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం రోడ్‌స్టర్ X టాప్ వేరియంట్ రేంజ్ 200 కిలోమీటర్లు. నివేదికల ప్రకారం.. ఓలా రోడ్‌స్టర్ ఎక్స్‌ను రూ. 75,000 ప్రారంభ ధర ఎక్స్-షోరూమ్‌గా ఉండే అవకాశం ఉంది. గతేడాది ఆగస్టు 15న ఓలా ప్రోగ్రామ్ కింద ధర గురించి సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత ఈ బైక్ లాంచ్ కోసం ఓలా లవర్స్ ఎదురుచూస్తున్నారు.
ఓలా ఈ కొత్త బైక్‌లో చాలా మంచి ఫీచర్లను చూడవచ్చు. భద్రత కోసం బైక్‌లో CBS, డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లు చూడచ్చు. అంతే కాకుండా ఓలా మ్యాప్ టర్న్ బై టర్న్ నావిగేషన్, ఓటీఏ అప్‌డేట్, డిజిటల్ కీ లాక్ వంటి ఫీచర్లను ఇందులో ఉంటాయి.
బైక్‌లో నార్మల్, ఎకో, స్పోర్ట్స్ వంటి మూడు మోడ్‌లు ఉంటాయి. బైక్‌లో సింగిల్ సీటు అందుబాటులో ఉంటుంది. కంపెనీ వ్యవస్థాపకుడు, CEO భవిష్ అగర్వాల్ ఈ కొత్త బైక్ కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. మరి కొత్త బైక్‌ను కస్టమర్లు ఎంతగా ఆదరిస్తారో చూడాలి.
Something special for the launch! pic.twitter.com/xxjF40aY7t
— Bhavish Aggarwal (@bhash) February 3, 2025