Cm Ys Jagan : “జగనన్న ఆణిముత్యాలు” కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. విద్యార్ధులకు బహుమతులు అందజేత
ఏపీ సీఎం వైఎస్ జగన్ "జగనన్న ఆణిముత్యాలు" కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్యంలోని వివిధ కేటగిరీ విద్యాసంస్థల్లో చదువుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో పదో తరగతి, ఇంటర్‌లో విద్యార్థులను ఎంపిక చేసింది.
Cm Ys Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ “జగనన్న ఆణిముత్యాలు” కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్యంలోని వివిధ కేటగిరీ విద్యాసంస్థల్లో చదువుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో పదో తరగతి, ఇంటర్‌లో విద్యార్థులను ఎంపిక చేసింది. పదో తరగతిలో కేటగిరీ వారీగా (జెడ్పీ, మున్సిపల్, మోడల్, ట్రైబల్/ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ తదితర) ప్రతి స్థాయిలో మొదటి మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అవకాశం కల్పించింది.
ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ/ఎంఈసీ, హెచ్‌ఈసీ(నాలుగు) గ్రూపుల్లో ప్రతి గ్రూపులోను రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన మొత్తం 22,710 మంది విద్యార్థులకు ప్రభుత్వం ‘జగనన్న ఆణిముత్యాలు’గా ప్రోత్సాహం అందించనుంది. 2022–23 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షల్లో పాఠశాల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో తొలి 3 ర్యాంకులు సాధించిన విద్యార్థులను రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12 నుంచి 19 వరకు ఇప్పటికే నగదు పురస్కారం, మెడల్, మెరిట్ సర్టిఫికెట్‌తో సత్కరించింది. వీరితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులను, సంబంధిత విద్యాసంస్థలకు మొమెంటోతో పాటు ప్రధానోపాధ్యాయులు/ప్రిన్సిపాళ్లను ప్రభుత్వం సన్మానించింది. విజయవాడలో జరుగుతున్న ఈ వేడుకలో సీఎం జగన్ (Cm Ys Jagan) పాల్గొని విద్యార్ధులకు బహుమతులు అందజేశారు. అక్కడ నుంచి మీకోసం ప్రత్యేకంగా ప్రత్యక్షప్రసారం..
మొత్తం విద్యార్థుల సంఖ్య : 22,710
పదో తరగతి విద్యార్థులకు..
రాష్ట్రస్థాయి నగదు పురస్కారం: ప్రథమ స్థానం– రూ.1,00,000, ద్వితీయ స్థానం– రూ.75,000, తృతీయ స్థానం– రూ.50,000, విద్యార్థులు 42 మంది.
జిల్లా స్థాయి నగదు పురస్కారం: ప్రథమ– రూ.50,000, ద్వితీయ– రూ.30,000, తృతీయ– రూ.15,000, విద్యార్థులు 609 మంది.
నియోజకవర్గ స్థాయి నగదు పురస్కారం: ప్రథమ– రూ.15,000, ద్వితీయ– రూ.10,000, తృతీయ–రూ.5,000, విద్యార్థులు 681 మంది.
పాఠశాల స్థాయి నగదు పురస్కారం: ప్రథమ– రూ.3,000, ద్వితీయ–రూ.2,000, తృతీయ– రూ.1,000, విద్యార్థులు 20,299 మంది.
ఇంటర్ విద్యార్థులకు..
రాష్ట్ర స్థాయి గ్రూపుల వారీగా టాపర్స్‌కు రూ.1,00,000 చొప్పున 26 మంది విద్యార్థులకు ప్రదానం
జిల్లా స్థాయిలో గ్రూపుల వారీగా టాపర్స్‌కు రూ.50,000 చొప్పున 391 మంది విద్యార్థులకు ప్రదానం
నియోజకవర్గ స్థాయిలో గ్రూపుల వారీగా టాపర్స్‌కు రూ.15,000 చొప్పున 662 మందికి ప్రదానం
ర్యాంకర్లకు సమాన మార్కులతో ఎంతమంది ఉన్నా అందరినీ సత్కరించనున్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి నగదుతో పాటు సర్టిఫికేట్, మెడల్ అందజేస్తారు.
ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో పోటీతత్వం పెరగాలని ఈ కార్యక్రమం. మన విద్యార్థి ఏ రాష్ట్రానికి వెళ్లినా పోటీతత్వంలో నిలబడతారు. విద్యార్థులే రేపటి భవిష్యత్తుగా ఏపీ ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది అని అన్నారు.