Home / ప్రాంతీయం
ఒక్క ఛాన్స్ అంటూ వేడుకుని అందరినీ నాశనం చేసారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేతపై మండిపడ్డారు. వారాహి యాత్రలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో గురువారం సాయంత్రం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
వేటకు వెళ్లి సముద్రంలో కొట్టుకుపోయిన ఓ మత్స్యకారుడు సుమారు 11 గంటల పాటు సముద్రంలో ఈత కొట్టి అటుగా వస్తున్న వేరే బోటు వారు రక్షించడంతో మృత్యుంజయుడుగా నిలిచాడు. దీనికి సంబంధించి వివరాలివి.
టిఎస్పిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేయాలన్న పిటిషన్పై హైకోర్టులో విచారణ మూడు వారాలకి వాయిదా పడింది. అభ్యర్థుల బయోమెట్రిక్ సేకరించక పోవడంపై అనుమానాలున్నాయని పిటిషనర్లు కోర్టుకి మొరపెట్టుకున్నారు. ఓఎంఆర్ షీటుపై హాల్ టికెట్, ఫొటో లేకపోవడం అనుమానాస్పదంగా ఉందని పిటిషనర్లు వాదనలు వినిపించారు
కొల్లూరులో ఆసియాలోనే అతిపెద్ద గృహ సముదాయం కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూం ఇళ్లని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆరుగురు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందించారు. అంతకుముందు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వారాహి విజయ యాత్ర కాకినాడ వేదికగా పవన్ కళ్యాణ్ అక్కడి స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. తాగిన మత్తులో డబ్బు పిచ్చితో స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదని ఆయన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు. కాగా ఈ వ్యాక్యలపై ద్వారంపూడి స్పందించారు.
Ashada Bonalu 2023: ఆషాడమాసం వచ్చేసింది. కొత్త పెళ్లికూతుర్లు అయితే పుట్టింటికి చేరారు. అంతే కాదండోయ్ ఆషాడం అనగానే బాగా గుర్తొచ్చేవి బోనాలు. తెలంగాణ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న బోనాలకు యావత్ రాష్ట్రం ముస్తాబవుతోంది.
హైదరాబాద్లోని వైద్య కళాశాలల్లో రెండవ రోజు ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్,మేడ్చల్ , రంగారెడ్డి జిల్లాల్లో దాదాపు 10 మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల్లో ఈడీ సోదాలు చేస్తోంది. 20 ప్రత్యేక బృందాలతో సోదాలు జరుగుతున్నాయి. ఇవాళ ఓవైసీ హాస్పిటల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.
Telangana Martyrs Memorial: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు నేటితో ముగియనున్న సందర్భంగా 22 జూన్ 2023న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా 'తెలంగాణ అమరుల స్మారకం –అమర దీపం' ప్రజ్వలన కార్యక్రమం జరుగనుంది.
Monsoon Weather Update: తెలుగు రాష్ట్రాలను ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు పలకరించాయి. తొలకరి చినుకులతో తెలుగు రాష్ట్రాలు మురిసిపోయాయి. ఒక్కసారిగా కురిసిన చిరు జల్లులతో నేల పరవసించిపోయింది. ఇన్నాళ్లూ భానుడి భగభగలతో అల్లాడిన ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
వైసీపీ ప్రభుత్వం కావాలా వద్దా అనేది రైతాంగం, యువత, ఆడపడుచులు నిర్ణయించుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వారాహి యాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్ముడివరం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. నా వద్ద వేలకోట్లు లేవు. సుపారీ గ్యాంగులు లేవు. ఒక్క ఎమ్మెల్యే, వారి వద్ద ఉన్న గూండాలు ఇన్ని కోట్ల మందిని భయపెడుతున్నారు