Home / ప్రాంతీయం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆలమూరు మండల పరిధిలోని మడికి నేషనల్ హైవేపై వ్యాన్, కారు ఢీకొన్నాయి. అనకాపల్లి సమీపంలోని చోడవరానికి చెందిన 9 మంది టాటా మ్యాజిక్ వ్యాన్‌లో కొత్తపేట మండలం మందపల్లికి దైవదర్శనం కోసం వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
వైసీపీ గూండాలను బట్టలూడదీసి కొట్టిస్తాను అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వారాహి యాత్రలో భాగంగా పిఠాపురం బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ వైసీపీ నేతల రౌడీయిజం పై మండిపడ్డారు. నాకు క్రిమినల్స్ అంటే చిరాకు. గూండాగాళ్లు, హంతకులు, నేరస్తులతోటి పాలించబడటానికి సిగ్గుండాలి. నేను సినిమా మాటలు మాట్లాడటం లేదు
హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేయాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు అన్నారు. 1956లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారని విద్యాసాగర్ రావు తెలిపారు. హైదరాబాద్ దేశానికి తలమానికమన్నారు.
నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణలో తాజా రాజకీయాలపై చర్చించారు. ఖమ్మం, నల్గొండ సభలకు ప్రియాంకను కోమటిరెడ్డి ఆహ్వానించారు. అనంతరం సోనియాగాంధీని కలిసి తెలంగాణలో రాజకీయ పరిణామాలపై చర్చించారు.
తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలో గోవిందరాజు స్వామి ఆలయం పక్కనే ఉన్న దుకాణంలో ఈ ప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం నేపథ్యంలో మాడ వీధుల్లో రాకపోకలను నిలిపివేశారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.
తెలంగాణకి చెందిన 152మంది పౌరహక్కులు, విప్లవ సంఘాల బాధ్యులు, మేధావులపై ఉపా చట్టంకింద కేసు నమోదయింది. 2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ జారీ చేశారు. ఆయుధాల చట్టం, భారత శిక్షాస్మృతిలోని 10 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వీరిలో పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ ఉన్నారు.
ఏపీ ప్రభుత్వం కృష్ణా జిల్లా గుడివాడ శివారులోని మల్లాయపాలెంలో అతిపెద్ద హౌసింగ్ క్లస్టర్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. టిడ్కో ద్వారా నిర్మించిన ఈ ఇళ్లను ఇవాళ సీఎం జగన్ ప్రారంభించి లబ్దిదారులకు అందించారు. ఈ మేరకు 77.46 ఎకరాలలో ఒకే చోట 8,912 టిడ్కో ఇళ్లు నిర్మాణం పూర్తి చేసి రాష్ట్రంలోనే అతిపెద్ద లే అవుట్‌గా
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకర్గం చేబ్రోలులో సెరీ కల్చర్ రైతులు, చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. స్వయంగా వెళ్లి వారి సమస్యలను అడిగితెలుసుకున్నారు. చేనేత కార్మికులు తమ సమస్యలను పవన్‌కు వివరించారు. సరైన మార్కెటింగ్ వ్యవస్థ లేకపోవడంతో నష్టపోతున్నామని నేతన్నలు తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు కే. చంద్రశేఖరరావు (కేసీఆర్) గురువారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో తన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా నీరు, విద్యుత్, వ్యవసాయోత్పత్తులకు సరైన ధర కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ అభివృద్ధి కోసం పిలుపునిచ్చారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ప్రైమ్ 9 న్యూస్ చైర్మన్ బండి శ్రీనివాస రఘువీర్ మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని కిషన్ రెడ్డి కార్యాలయంలో చైర్మన్ శ్రీనివాస రఘవీర్, ప్రైమ్ 9 సీఈఓ వెంకటేశ్వరరావు లు.. ఆయనను కలిసి పలు విషయాలపై చర్చించారు.