Home / ప్రాంతీయం
వైఎస్ వివేకా హత్య కేసులో గతనెల 30న ఛార్జిషీటు సమర్పించిన సీబీఐ వైఎస్ షర్మిల వాంగ్మూలాన్ని కీలకంగా ప్రస్తావించింది. షర్మిల వాంగ్మూలాన్ని చార్జిషీటులో పొందు పరిచింది. గతేడాది అక్టోబర్ 7న షర్మిల ఢిల్లీలో 29వ సాక్షిగా సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు.
ఏపీ ప్రజలకి సంబంధించిన అన్ని వివరాలు సేకరిస్తున్న డేటాపై ప్రభుత్వం తక్షణమే వివరణ ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. తన ట్వీట్‌కి ఓ వీడియోని కూడా ఆయన జత చేశారు. త్వరలో రాష్ట్రమంతా ఉద్యమంలా ప్రజలు వైఎస్ఆర్సిపిపై తిరుగుబాటు మొదలు పెడతారు సిద్ధంగా ఉండు జగన్ అంటూ జనసేన శతఘ్ని టీం హెచ్చరించింది.
తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొందరు నేతలనుద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ అధిష్టానానికి తప్పుడు రిపోర్టులు ఇవ్వొద్దని చురకలంటించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ఊటీగా పిలువబడే అనంతగిరి ఇప్పుడు నిజమైన ఊటిగా మారింది. రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎక్కడ చూసినా జలపాతాలు జాలువారుతున్నాయి. ఈ సుందర దృశ్యాలను చూసి పర్యాటకులే కాదు స్ధానికులు కూడా మైమరిచిపోతూ ఎంజాయ్ చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నేతన్న నేస్తం నిధులు విడుదల చేసిన సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్, లోకేష్, బాలకృష్ణపై తీవ్ర విమర్శలు చేశారు. మంచి చేస్తున్న వ్యవస్థలను కొంతమంది విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సీబీఐ చార్జిషీట్లో ప్రస్తావించిన కీలక అంశాలు బయటికి వచ్చాయి. హత్యకు కుట్ర చేశారని, ఘటనాస్థలంలో ఆధారాలు చెరిపేశారని సీబీఐ తెలిపింది. ఫొటోలు, గూగుల్ టేక్ అవుట్, లొకేషన్ డేటాను సీబీఐ కోర్టుకు సమర్పించింది. వివేకా హత్యకు అవినాష్, భాస్కర్‌రెడ్డి కుట్ర చేశారని సీబీఐ నిర్థారించింది.
Bank Notice To Mla Sridhar Reddy: ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆస్తులు వేలానికి సిద్ధమయ్యాయి. ఎమ్మెల్యే ఆస్తుల్ని వేలం వేస్తున్నట్లు కెనరా బ్యాంకు బహిరంగ ప్రకటన జారీచేసింది.
Weather Alert: ఒకవైపు అల్పపీడనం, ఇంకోవైపు నైరుతి మేఘాలు, మరోవైపు ఉపరితల ఆవర్తనం.. ఈ మూడు కలిసి తెలుగు రాష్ట్రాలపై మూకుమ్మడి దాడి చేస్తున్నాయి. ఎడతెరపిలేని జోరువానతో తెలుగు రాష్ట్రాలు తడిచి ముద్దయ్యాయి.
భారీ వర్షాలతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అల్లకల్లోలమవుతోంది. అల్లూరిజిల్లాలో గోదావరి, శబరి నదులకి వచ్చిన వరదలతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. విలీన మండలాలకి అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చేరుకున్నారు. కూనవరం, విఆర్ పురం మండలాల్లో కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యటించారు.
జగన్‌కు చెబుతున్నా.. నన్ను అరెస్ట్ చేసుకోండి అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. గురువారం సాయంత్రం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జగన్ మీరు ప్రాసిక్యూషన్ అంటే ప్రాసిక్యూషన్‌కు రెడీ.. జైలుకు వెళ్లేందుకు.. దెబ్బలు తినేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేసారు.