Home / ప్రాంతీయం
టీటీడీ చైర్మన్ పదవి రాయలసీమలో 20 లక్షలు జనాభా ఉన్న బలిజలకు ఇవ్వాలని హరిరామ జోగయ్య డిమాండ్ చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి.. మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య మరోలేఖ రాశారు. ఇప్పటికే పలు అంశాలను లేఖల ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఆయన.. ఇప్పుడు టీటీడీ చైర్మన్ వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
గత ఆరు రోజులుగా కనిపించకుండా పోయిన హైదరాబాద్ ఐఐటీ కార్తీక్ కథ విషాదంగా ముగిసింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కార్తీక్ ఐఐటీహెచ్‌లో బీటెక్(మెకానికల్) ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 17న ఐఐటీ క్యాంపస్ నుంచి బయటికి వెళ్లి కనిపించకుండా పోయాడు. జూలై 18న తల్లిదండ్రులు కార్తీక్ కు ఫోన్ చేయగా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బిఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా గెలిచారు. అయితే జలగం వెంకట్రావు రెండో స్థానంలో నిలిచారు. ఎమ్మెల్యే వనమా సమర్పించిన అఫిడవిట్లో తేడాలున్నాయంటూ జలగం వెంకట్రావు హైకోర్టుని ఆశ్రయించారు
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే తెలంగాణ, ఏపీల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఇక ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ
హైదరాబాద్‌లో వర్షం దంచి కొడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్‌తో పాటు.. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన కురుస్తోంది. వర్షం కారణంగా నగరంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలు మెల్లిమెల్లిగా ముందుకుసాగుతున్నాయి. దీంతో ట్రాఫిక్‌లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటిస్తున్న ప్రాంతాల్లో ప్రతిసారీ చెట్లని కొట్టివేస్తుండటంపై జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. కోనసీమలో కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకుగా భావిస్తారని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. అటువంటి కొబ్బరి చెట్లను సైతం నిలువునా నరికేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు
కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో రాజకీయం మరింత వేడెక్కింది. మంత్రి చెల్లుబోయిన వేణు, ఎంపీ పిల్లీ సుభాష్ మధ్యన నడుస్తున్న వివాదం తాడేపల్లికి చేరింది. దీంతో వచ్చి కలవాలంటూ అధిష్టానంనుంచి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకి ఆదేశాలు అందాయి. తాడేపల్లికి చేరుకున్న తోట త్రిమూర్తులు రామచంద్రపురం వివాదంపై అధిష్టానంతో చర్చిస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, ఐటీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు. దీంతో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్ కు వివిధ రూపాల్లో భర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. కొందరు ప్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటుచేస్తే మరికొందరు అన్నదానం, రక్తదానం, రోగులకు పండ్ల పంపిణీ వంటివి చేస్తూ పుట్టినరోజు వేడుక జరుపుతున్నారు.
పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం అంబడిపూడి సమీపంలోని కృష్ణా నదిలో పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. వీటిలో విష్ణుమూర్తితో పాటు శివలింగం, రెండు నంది విగ్రహాలు ఉండడం విశేషం. దీంతో కృష్ణా నది వద్దకు వెళ్ళిన గ్రామస్తులు విగ్రహాలను చూసి వెంటనే వాటికి ఒడ్డుకు చేర్చారు. రక్షిత మంచినీటి పథకం కాలువ వద్దకు చేర్చిన
తమిళ్ స్టార్ హీరో సూర్య.. తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. అయితే ఏపీలోని పల్నాడు జిల్లా నర్సరావుపేట మోపువారిపాలెంకి చెందిన అభిమానులు ఫ్లెక్సీలు కట్టి సూర్య బర్త్ డేని సెలబ్రేట్ చేద్దామనుకొని మృత్యువు ఒడిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. కాగా డిగ్రీ చదువుతున్న ముగ్గురు