Home / ప్రాంతీయం
Dimple Hayathi: టాలీవుడ్ యాక్ట్రెస్ డింపుల్ హయతి గత కొద్దికాలంగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే వివాదంతో ఆమె మరింతగా మీడియా కథనాల్లో నిలుస్తున్నారు.
హైదరాబాద్ నగర శివార్లలోని బాటసింగారంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణాలని పరిశీలించేందుకు వెళుతున్నకేంద్రమంత్రి, బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ఓఆర్ఆర్పై తుక్కుగూడ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నడిరోడ్డుపై కిషన్ రెడ్డితోపాటు ఇతర బిజెపి నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కిషన్ రెడ్డి తదితరులని అరెస్ట్ చేసి పార్టీ కార్యాలయానికి తరలించారు.
Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కాస్త అల్పపీడనంగా మారడంతో ఏపీలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికాలు జారీ చేసింది.
ఏపీ రాజకీయాలపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరి రామ జోగయ్య సంచలన విశ్లేషణ చేశారు. ఎన్‌డిఎ మిత్ర పక్షాల ఆత్మీయ సమావేశానికి పవన్ కళ్యాణ్‌ని పిలవడమంటే తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఆయన చరిష్మాని ఉపయోగించడం ద్వారా లబ్ధి పొందాలనేదే ధ్యేయంగా కనిపిస్తోందని జోగయ్య అంచనా వేశారు.
జనగామ పోలీసు స్టేషన్ కు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురు తుల్జా భవాని రెడ్డి చేరుకున్నారు. తన విధులకి ఆటంకం కలిగిస్తోందంటూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గతంలో పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీంతో తుల్జా భవాని రెడ్డిపై పోలీసులు ఎఫ్ఐఆర్ జారీ చేశారు.
మూడు రోజులుగా ఢిల్లీలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేటి ఉదయం ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధరన్‌తో భేటీ అయ్యారు. ఈ అల్పాహార సమావేశంలో పవన్‌తోపాటు నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. 15 నిమిషాల పాటు ఏపీ రాజకీయ వ్యవహారాలపై చర్చించారు.
మనుష్యులు మనుష్యులుగా ప్రవర్తించడం మానేశారా అనే ప్రశ్న ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఇటీవల ఒక వ్యక్తిపై మరో వ్యక్తి మూత్రం పోసిన ఘటన దేశ వ్యాప్తంగా ఎంత సంచలనంగా మరిందో అందరికీ తెలిసిందే. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పందించారు. కాగా ఇప్పుడు అంతకన్నా అవమానీయ ఘటన ఏపీలో చోటు చేసుకుంది.
నంద్యాల జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ ఇంటి పెరట్లో పూలు ఉన్నాయని, వచ్చి కోసుకెళ్లమని నమ్మించి 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు ఓ దుర్మార్గుడు. మొదట ఈ విషయాన్ని పెద్దల సమక్షంలో సెటిల్ మెంట్ చేసేందుకు యత్నించగా.. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా సీఎం చేయమని.. కోరడం.. వైసీపీ ఎమ్మెల్యే లపై పవన్ కళ్యాణ్ విరుచుకుపడడం.. సర్వత్రా ఆసక్తి కలిగిస్తుంది. ఈ క్రమంలోనే పవన్ తో 57 మండీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్లు సమాచారం అందుతుంది.
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు జోరు పెంచాయి. ఈ క్రమం లోనే పొత్తుల గురించి తీవ్ర చర్చ జరుగుతుంది. కాగా అధికార పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని వైకాపా నేతలు చెబుతుండగా.. ప్రతిపక్షం లోని తెదేపా, జనసేన పార్టీలు వారి వారి శైలిలో ప్రజా క్షేత్రంలోకి దూసుకుపోతున్నారు.