Naga Chaitanya: ఆ విషయంలో ఫుల్ క్రెడిట్ శోభితకే ఇస్తున్నా – భార్యపై నాగ చైతన్య ప్రశంసలు
Naga Chaitanya About Sobhita: తన భార్య శోభితపై ప్రశంసలు కురిపించాడు అక్కినేని హీరో నాగచైతన్య. ఆయన లేటెస్ట్ మూవీ తండేల్ త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా నేషనల్ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తండేల్ మూవీ విశేషాలతో పాటు, శోభితతో తన మ్యారేజ్ గురించి ప్రస్తావించాడు. తను సంప్రదాయాలను చాలా విలువ ఇస్తుందని, మా పెళ్లి ఏర్పాట్లు అంత బాగా జరగానికి తనే కారణమంటూ భార్యను కొనియాడాడు.
ఈ మేరకు నాగ చైతన్య మాట్లాడుతూ.. “శోభిత చూడాటానికి మోడ్రన్ అమ్మాయిలా ఉంటుంది. కానీ తనకు తెలుగు నెటివిటీ అంటనే ఇష్టం. మన సంస్కృతి, సంప్రదాయాలను చాలా గౌరవిస్తుంది. మా పెళ్లి అంత సంప్రదాయబద్దంగా జరగానికి తనే కారణం. మా పెళ్లి సమయంలో నేను షూటింగ్‌తో బిజీగా ఉండటం వల్ల తనే ఏర్పాట్లు చూసుకుంది. మా పెళ్లిని తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా తనే ప్లానింగ్ అంతా డిజైన్ చేసింది. ఈ విషయంలో ఫుల్ క్రెడిట్ తనకే ఇస్తున్నా” అంటూ చెప్పుకొచ్చాడు.
కుటుంబంతో కలిసి సంతోషంగా గడిపిన ఆ క్షణాలు ఏప్పటికీ తనకు పదిలమే అని, తన జీవితంలో చాలా విలువైన క్షణాలవి అని ఎమోషనల్ అయ్యాడు. కాగా నాగ చైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన తండేల్ మూవీ ఫిబ్రవరి 7న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా పాటలు, పోస్టర్స్ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా తండేల్ రాజుగా నాగచైతన్య యాక్టింగ్ అభిమానులు ఫిదా అవుతున్నారు. మూవీ టీం కూడా ఈ సినిమా కోసం తను పెట్టిన ఎఫర్ట్స్‌ని కొనియాడుతున్నారు.
ట్రైలర్, పాటల్లో ప్రేమికులుగా సాయి పల్లవి, నాగ చైతన్యల కేమిస్ట్రీకి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. దీంతో తండేల్ మూవీపై ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ అడ్వాన్స్ బుక్కింగ్స్ ఒపెన్ అవ్వగా భారీ స్థాయిలో టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. బుక్ మై షోలో లక్షల్లో లైక్స్, ఇంట్రెస్ట్స్‌తో తండేల్ మూవీ ట్రెండింగ్‌లో ఉంది. ఈ మూవీ వస్తున్న క్రేజ్ చూస్తుంటే ఫస్ట్ డేనే తండేల్ మూవీ భారీ ఒపెనింగ్స్ రాబట్టేలా కనిపిస్తోంది. కాగా గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.